మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా వస్తోన్న చిత్రం ఇది. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ .. చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించబోతోంది.
చాలా రోజుల క్రితమే దర్శకత్వానికి దూరమైన మెహర్ రమేష్ ఈ మూవీతో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. ఈ ఆగస్ట్ 11న రిలీజ్ అనే టార్గెట్ గాతో రూపొందుతోన్న ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ లో ఉంది.
కొన్నాళ్ల క్రితం చిరంజీవి రంగస్థలం సినిమాకు సంబంధించి కుమార్ బాబు(ఆదిపినిశెట్టి) చనిపోయినప్పుడు వచ్చే పాట అద్భుతంగా ఉంటుందని లీక్ చేశాడు. నిజానికి ఆ ఎపిసోడ్ ఉంటుందని సినిమా చూసే వారికి సర్ ప్రైజింగ్ గా ఉంచాడు సుకుమార్. బట్ మెగాస్టార్ సడెన్ గా లీక్ చేశాడు. ఆ తర్వాత కొరటాల శివతో చేసిన ఆచార్య మూవీ టైటిల్ ను కూడా ప్లానింగ్ లేకుండా లీక్ చేశాడు.
అప్పటి నుంచి మెగాస్టార్ తనకు తనుగానే “చిరు లీక్స్” అనే పేరు పెట్టుకుని కొన్ని వార్తలు, అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ భోళా శంకర్ సినిమా షూటింగ్ కు సంబంధించి కూడా తను చిరు లీక్స్ పేరుతో కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టాడు.
దీంతో పాటు “స్విట్జర్లాండ్”లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం. అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ ” అంటూ సరదాగా రాసుకొచ్చాడు మెగాస్టార్.
మొత్తంగా ఈ చిత్రం ఆగస్ట్ 11న వస్తుందని చెబుతున్నారు కానీ.. జూన్ నెలలో జరిగే షూటింగ్ ను బట్టి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటారు అని కూడా వినిపిస్తోంది. ఒక వేళ లేట్ అయితే మాత్రం మళ్లీ గాడ్ ఫాదర్ లా దసరాకే విడుదలవుతుందనే టాక్ కూడా ఉంది.