2018 : టాప్ హీరో రికార్డ్స్ ను ముంచేసిన స్మాల్ హీరోస్

ఒక చిన్న సినిమా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టడం అత్యంత అరుదుగా జరుగుతుంది. అయితే అది అన్ని పరిశ్రమల్లో సాధ్యం కాదు. సాధ్యం కావాలి అంటే ఆ సినిమాలో ఎంతో కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ ఆ ప్రాంత ప్రజలకు ఎమోషనల్ గానూ కనెక్ట్ కావాలి. అలా అయింది కాబట్టే ఇప్పుడు మళయాలంలో చాలా చిన్న సినిమాగా వచ్చిన 2018 అక్కడి అన్ని రికార్డులను బద్ధలు కొట్టింది.

ఎంటైర్ మాలీవుడ్ కు ఓ కొత్త బెంచ్ మార్క్ కూడా సెట్ చేయబోతోంది. ఈ మూవీ కంటే ముందు మాలీవుడ్ లో హయ్యొస్ట్ కలెక్షన్స్ రికార్డ్ మోహన్ లాల్ పులిమురుగన్(తెలుగులో మన్యంపులి)పై ఉంది. 140 కోట్ల పైగా కలెక్షన్స్ తో మోహన్ లాల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఆయనే లూసీఫర్, దృశ్యం చిత్రాలతో వరుస స్థానాల్లో ఉన్నాడు. నాలుగో స్థానంలో మమ్మూట్టి ఉన్నాడు. అంటే ఇద్దరు టాప్ హీరోలు టాప్ రికార్డ్స్ తో ఉన్నారన్నమాట. బట్ ఈ రికార్డులను 2018 కొల్లగొట్టింది.

2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ కాసుల వరదపారిస్తోంది. ఈ వరదకు మాలీవుడ్ లోని అన్ని రికార్డులూ మునిగిపోయాయి. ఇప్పటికే ఈ మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రిలీజ్ అయి నెల కావొస్తున్నా.. ఇంకా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీంతో ఈజీగా 200 కోట్లు కొల్లగొడుతుంది అనేది ట్రేడ్ అంచనా. కాకపోతే ఓటిటిలో విడుదల కాకుండా ఉండాలి. అప్పుడే ఆ కొత్త బెంచ్ మార్క్ సాధ్యం అవుతుంది.


ఇంత చేస్తే ఈ మూవీలో అసలు స్టార్ కాస్ట్ లేకపోవడం విశేషం. ఉన్నంతలో టోవినో థామస్ మాత్రమే కాస్త పెద్ద హీరో. అలాగని సినిమా అంతా అతనిపై నడవదు. మిగిలిన వారిలో కుంచకో బోబన్ ఉన్నాడు. అతని పాత్ర పరిమితం. మరొకరు అసిఫ్‌ అలీ. ఈ కుర్రాడూ అప్ కమింగ్ హీరో. నరైన్, లాల్, వినీత్ శ్రీనివాసన్ ఉన్నా.. వారూ హీరోలుగానే కనిపిస్తారు. ఫీమేల్ లీడ్స్ కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా వారూ తమదైన ముద్ర వేయగలిగారు. ఓవరాల్ గా చూస్తే అంతా చిన్నవాళ్లే. ఈ చిన్నవాళ్లే ఇప్పుడు మళయాలంలో చాలా పెద్ద రికార్డ్స్ ను కొల్లగొట్టి.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఏదేమైనా కంటెంట్ కు ఉండే బలమే ఇది. అన్నట్టు తెలుగులో కూడా ఈ చిత్రం వీకెండ్ కే లాభాల్లోకి వచ్చింది. కాకపోతే వరదలు.. దాని ద్వారా ఎదుర్కొనే ఇబ్బందులు అనే ఎమోషన్ మనకు పెద్దగా తెలియకపోవడంతో తెలుగు ఆడియన్స్ దానికి కనెక్ట్ కాలేదు. లేదంటే కాంతార రేంజ్ లో ఇక్కడా అదరగొట్టేదేమో..

Related Posts