ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం పై చిరు అసంతృప్తి
Latest Movies Tollywood

ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం పై చిరు అసంతృప్తి

ఏపీలో సినిమాల టిక్కెట్ల‌ను ఆన్ లైన్ లో అమ్మేలా ప్ర‌భుత్వం జీవీ తీసుకువ‌చ్చింది. అయితే.. రోజుకు నాలుగు షోల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది. అలాగే భారీ చిత్రాల‌కు టిక్కెట్ల రేట్లు పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీని వ‌ల‌న భారీ చిత్రాల‌కు భారీగా న‌ష్టం. ముఖ్యంగా డిసెంబ‌ర్ నుంచి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ రాయ్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయ‌క్.. ఇలా భారీ చిత్రాల‌కు భారీగా న‌ష్టం. ఇది ఇలాగే కొన‌సాగితే భారీ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపించ‌క‌పోవ‌చ్చు.

ఈ విష‌యం గురించి చిరంజీవి స్పందిస్తూ.. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది అని చిరంజీవి పేర్కొన్నారు.

Post Comment