సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే తెలుగులో ఓ ప్రామినెంట్ ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.పైగా ఈ బ్యానర్ లో రెండో సినిమా చేసే దర్శకులు విజయవంతంగా ద్వితీయ విఘ్నం దాటుతారు అనే పేరూ తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా ఈ బ్యానర్ బయటి హీరోలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సార్ అనే మూవీ చేశారు. మరీ బ్లాక్ బస్టర్ కాదు కానీ.. హిట్ అనిపించుకుంది. అంతే కాక ప్రశంసలు కూడా దక్కించుకుందీ చిత్రం.
తర్వాత ఇదే బ్యానర్ లో ధనుష్ తోనే మరో సినిమా చేస్తారు అనే టాక్ వచ్చింది. బట్ హీరో మారాడు.
మళయాల సూపర్ స్టార్ దుల్కర్ సాల్మన్ తో సితార బ్యానర్ కొత్త సినిమా చేయబోతోంది. ఇప్పటికే ఓకే బంగారం వంటి డబ్బింగ్ మూవీతో పాటు మహానటి, సీతారామంతోతెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్. ఆ క్రేజ్ కు సితార వంటి బ్యానర్ తోడైతే అంచనాలు పెరుగుతాయి. విశేషం ఏంటంటే.. ఈ బ్యానర్ దర్శకుడు వెంకీ అట్లూరి మాత్రం వదలడం లేదు. వెంకీ అట్లూరి సితారలో చేసిన ఫస్ట్ మూవీ రంగ్ దే పోయినా.. సార్ మూవీ ఇచ్చారు. సార్ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఇప్పుడు దుల్కర్ ను ఇచ్చారు. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.
మామూలుగా దుల్కర్ కథలో ఏదో కొత్త పాయింట్ లేకపోతే అస్సలు ఒప్పుకోడు. పైగా కేవలం మళయాలంలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసేలా సినిమాలు ఒప్పుకుంటాడు
మరి ఈ కథలో అతనికి నచ్చిన పాయింట్ ఏంటో కానీ.. సీతారామం తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు దుల్కర్ తో తెలుగులో సినిమా చేయాలని ప్రయత్నించారు. బట్ ఫైనల్ గా సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర కాస్ట్ అండ్ క్రూకు సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.