‘సార్’ ఇంకెప్పుడు మొదలుపెడతారో..?

ప్యాన్ ఇండియన్ సినిమాలకు వచ్చినంత క్రేజ్.. ప్యాన్ సౌత్ సినిమాలకు రావడం లేదు. అంటే ఒక భాషలో నిర్మితమై సౌత్ లోని ఇతర భాషల్లో విడుదలయ్యే సినిమాలన్నమాట. అందుకు ఖచ్చితమైన ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన వారసుడు, తెగింపు చిత్రాలే. ఈ రెండు సినిమాలను డబ్బింగ్ సినిమాలుగా మాత్రమే చూశారు తప్ప.. తెలుగువాళ్లు ఓన్ చేసుకోలేదు. లేదా ఓన్ చేసుకునేలా ప్రమోషన్స్ చేయలేదు అనడం కరెక్టేమో. ఇప్పుడు ఇదే ప్రమాదం సార్ కు కూడా ఎదురు కాబోతోంది. ఈ నెల 17న విడుదల అనే పోస్టర్ వదిలారు. ఆ మధ్య వచ్చిన టైటిల్ సాంగ్ తో పాటు బంజారా పాట కూడా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నా.. సార్ సౌండేం వినిపించడం లేదు. ఇంతకీ సార్ 17నుంచే క్లాసులు మొదలుపెడతాడా లేదా..?


ప్రమోషన్స్ లేని సినిమాలు స్టార్స్ వైనా పట్టించుకోవడం లేదు ఆడియన్స్. పైగా బై లింగ్వుల్ అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. కంటెంట్ బలంగా ఉన్నా.. ఆ బలం మాకు ఉందని ముందే ఆడియన్స్ లో అటెన్షన్ తెచ్చుకుని అంచనాలు పెంచాలి. అలాపెంచినా.. రిలీజ్ రోజు మొదటి ఆట చూశాక కానీ రిజల్ట్ ఏంటనేది తేలదు. అలాంటిది రెండున్నర వారాల్లోనేవిడుదల కానున్న ధనుష్‌ మూవీ సార్ విషయంలో ఇలాంటి సౌండేం కనిపించడం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిందీ సినిమా. ధనుష్ ఫస్ట్ టైమ్ చేస్తోన్న తెలుగు సినిమా అని మనవాళ్లు చెబుతున్నా.. సదరు హీరోలు మాత్రం వీటిని డబ్బింగ్ సినిమాలుగానే చూస్తున్నారు. అలా చూసిన వారసుడు, తెగింపు రెండూ తెలుగులో పోయాయి. ఇప్పుడు సార్ కు ఆ ప్రమాదం రాకూడదు అంటే సదరు హీరోతో ప్రమోషన్స్ కాస్త గట్టిగానే ప్లాన్ చేయాలి.

ఇంకా చెబితే ధనుష్ కు ఫ్యాన్స్ ఉన్నారు కానీ.. తెలుగులో బలమైన మార్కెట్ అయితే లేదు. అలాగని హీరోయిన్ ఏమైనా క్రేజీ బ్యూటీనా అంటే అదీ కాదు. పోనీ దర్శకుడు వెంకీ అట్లూరికి వీరాభిమానులున్నారా అంటే అదీ లేదు. వెంకీ గత రెండు సినిమాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే పోయాయి. రంగ్ దే ఈ సితార బ్యానర్ లోనే రూపొందింది. అలాంటప్పుడు ప్రొడక్షన్ హౌస్ కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అసలే ఫిబ్రవరి 17న గట్టి పోటీ ఉంది. ఈ కాంపిటీషన్ ను తట్టుకుని నిలబడాలంటే ప్రమోషన్స్ క్లాసులు బాగా తీసుకోవాలి. లేకపోతే అది రిజల్ట్ పై ప్రభావం చూపిస్తుంది. మరి ఇకనైనా ప్రిన్సిపల్ లాంటి నిర్మాతలు సార్ తో ప్రమోషన్స్ చేయించకుంటే ఆ రోజు ఉన్న భారీ పోటీలో వెనకబడిపోతారని చెప్పొచ్చు.

Related Posts