సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి
Latest Movies Tollywood

సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి

ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం వారం రోజులుగా అదృశ్యమైంది. ఎవ‌రి ఫోన్లు ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ కి అనుమానం వ‌చ్చింది. కుటుంబం మొత్తం ఎందుకు అదృశ్యం అయ్యింది..? అస‌లు ఏమైంది..? అనేది ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. అయితే..

హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై లభించింది.వారం రోజులుగా హరిణి కుటుంబ సభ్యుల ఫోన్లు పనిచేయడం లేదు. హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో ఏకే రావు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత ఏకే రావు సుజనా పౌండేషన్ కు సీఈఓగా పని చేస్తున్నారు.

సింగ‌ర్ హరిణి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సింగర్ గా పేరు తెచ్చుకొంది. వారం రోజులుగా ఏకే రావు సుజ‌నా ఫాండేష‌న్ కార్యాలయానికి రాలేదని అక్కడ పని చేసేవారు చెప్పారు.

అయితే.. ఏకే రావు బెంగుళూరు రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే..

ఏకే రావు ప్రమాదవశాత్తు రైలు నుండి పడి చనిపోయాడా..? లేదా ఎవరైనా అతన్ని చంపి రైల్వే ట్రాక్ పై పడేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post Comment