రూల్స్ మస్ట్ బీ ఫాలోడ్.. బట్ నాట్ ఇన్ లెటర్స్ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. అంటే రూల్స్ పాటించాలి. కానీ అక్షరాలా కాదు అని అర్థం. ప్రస్తుతం తెలుగులో చాలామంది నిర్మాతలు ఈ సామెతనే ఫాలో అవుతున్నారు. అంటే ఒక సినిమా విడుదలైన ఏడు వారాలకు కానీ ఓటిటిలో విడుదల చేయకూడదు అని వాళ్లే ఓ రూల్ పెట్టుకున్నారు.
కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంటే ఆ రూల్ ను బ్రేక్ చేసి ఏడువారాలు కాకుండానే ఓటిటిలో వదులుతున్నారు. పైగా ఈ వేసవిలో విజయాల కంటే డిజాస్టర్లే ఎక్కువ పడ్డాయి టాలీవుడ్ కు.
అందులో చాలా పెద్ద డిజాస్టర్ సమంత(Samantha) నటించిన శాకుంతలం(Shakunthalam).
గుణశేఖర్(Gunashekhar) స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు( Dil Raju) విడుదల చేశాడు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. బట్ ట్రైలర్ తర్వాత కొంత తగ్గాయి. ఇక సినిమా థియేటర్స్ లో హాహారాకాలు పెట్టించింది. కాళిదాసు రాసిన శాకుంతలం కావ్యంలో ఒక్క శాతం కూడా ఈ చిత్రం అందుకోలేకపోయిందని ఎంతోమంది విమర్శించారు. సమంత ఆ పాత్రకు సూట్ కాలేదని కొందరు అన్నారు.
అది దర్శకుడి ఛాయిస్. ఓ నటిగా తను చేయాల్సింది చేసింది. కానీ ఎంచుకున్న దర్శకుడిని వదిలేసి సమంతను అంటే ఎలా అనేది కొందరి వాదన. ఏదేమైనా తెలుగులో ఓ అందమైన పురాణ కావ్యంగా వెలిగిన శాకుంతలం సినిమాగా మాత్రం డిజాస్టర్ అయిది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం 15 కోట్లు కూడా వెనక్కి రాబట్టలేపోయింది.
అంటే ఏ రేంజ్ డిజాస్టరో ఊహించుకోవచ్చు. నిజానికి ఈ చిత్రం బావుంది అన్న టాక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా థియేటర్స్ కు రావడం మానేసిన పాత తరం వాళ్లు కూడా వచ్చి చూసేవారే. కానీ పోయింది.
ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సైలెంట్ గా తమ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ పెట్టేసింది. అంటే ఈ స్ట్రీమింగ్ కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా వేస్ట్ అనుకున్నారో లేక రూల్ ను బ్రేక్ చేస్తున్నారని అనవసరమైన రచ్చ అవుతుందీ అనుకున్నారేమో కానీ.. ప్రస్తుతం శాకుంతలం అమెజాన్(Amazon) లో స్ట్రీమ్ అవుతోంది.