HomeLatestSreeleela : పూజాహెగ్డేకు ఎసరు పెట్టిన శ్రీ లీల

Sreeleela : పూజాహెగ్డేకు ఎసరు పెట్టిన శ్రీ లీల

-

ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అంటారు. అలా సీనియర్ హీరోయిన్ కంటే జూనియర్ హీరోయిన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ జూనియర్ కు హిట్స్ ఉంటాయి. అదిరిపోయే అందం ఉంటుంది. ఎవరినైనా ఆకట్టుకునే ఛలాకీ తనం ఉంటుంది. దాంతోనే పాత హీరోయిన్లకు కొత్తగా ఎసరుపెడుతుంటారీ జూనియర్ బ్యూటీస్. అలా ఇప్పుడు పూజాహెగ్డే పాత్రకే ప్రమాదం తెచ్చిందట శ్రీ లీల. అది కూడా త్రివిక్రమ్ సినిమాతో.


ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్‌ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో పూజాహెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ అనుకున్నదానికంటే కాస్త ఆలస్యం అయింది. ఈ గ్యాప్ లోనే మొదట సెకండ్ హీరోయిన్ గా ఎంటర్ అయిన శ్రీ లీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ రేంజ్ కు మారబోతోందనే వార్తలు వస్తున్నాయి.అంటే ఈ గ్యాప్ లో అమ్మడు ధమాకాతో బ్లాక్ బస్టర కొట్టింది.

ఇప్పుడు ఇండియాలో ఏ హీరోయిన్ చేతిలోనూ లేనన్న ఆఫర్స్ ఉన్నాయి. హీరోయిన్ గా చేస్తూనే బాలయ్య మూవీలో ఆయన కూతురుగానూ నటిస్తోంది. అంతేకాక ఇప్పుడు స్మాల్ స్టార్ నుంచి టాప్ స్టార్ వరకూ అమ్మడి పేరును కలవరిస్తున్నారు. ఆ కలవరింతే త్రివిక్రమ్ లోనూ మార్పులు తెచ్చిందట.

దీంతో పూజాహెగ్డే కోసం రాసుకున్న చాలా సీన్స్ ను మార్చి శ్రీ లీలకు తగిలిస్తున్నారని టాక్. అంటే మెల్లగా పూజా పాత్ర ప్రాధాన్యత తగ్గుతుంది. శ్రీ లీల రేంజ్ పెరుగుతుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం రూమర్స్ గానే వినిపిస్తున్నాయి.

కాకపోతే ప్రస్తుతం పూజాహెగ్డే, శ్రీ లీల రేంజ్ లను బట్టి చూస్తే పూజా పని దాదాపు అయిపోయిందనే చెప్పాలి. అలాంటి బ్యూటీతో ఎక్కువ సీన్స్ చేసేకంటే రైజింగ్ లో ఉన్న ఛలాకీ పాప శ్రీ లీలతో అయితే బెటర్ కదా.. అని కామన్ ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ డాక్టర్ పిల్ల డస్కీ బ్యూటీకి ఎసరుపెట్టిందనే చెప్పాలి. అది కూడా గురూజీ సినిమాలో కావడమే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది.

ఇవీ చదవండి

English News