“ఆడవాళ్ళు మీకు జోహార్లు” షూటింగ్ లో శర్వా, రష్మిక
Latest

“ఆడవాళ్ళు మీకు జోహార్లు” షూటింగ్ లో శర్వా, రష్మిక

శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు. తాను సైన్ చేసిన మూడు సినిమాల్లో ఒకే ఒక జీవితం అనే మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే మరో మూవీ మహా సముద్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మహా సముద్రం ఫినిష్ అయ్యిందో లేదో పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే మరో కొత్త సినిమా షూటింగ్ ని ప్రారంభించాడు శర్వానంద్. ఆ సినిమానే ఆడవాళ్ళు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో హీరో శర్వానంద్ తో పాటు రష్మిక కూడా పాల్గొంటోంది. తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్న రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్ కావడంతో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. అలాగే కిషోర్ తిరుమల ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది. మహిళల గొప్పతనాన్ని వివరించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈచిత్రం రాబోతుంది. శర్వా ఇందులో పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. రష్మిక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోంది. ఇవాళే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, కళ్యాణీ నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Post Comment