నోరు తెరిచిన షన్నునోరు మూసుకోమన్న అనీ మాస్టర్…
Latest Reality shows Small Screen

నోరు తెరిచిన షన్నునోరు మూసుకోమన్న అనీ మాస్టర్…

బిగ్ బాస్ అసలు సిసలు మజా వీకెండ్ లో కాదు.. వీక్ డేస్ లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. సండే అంటే ఫన్ డే అని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తో తెలిపాడు.. అయితే, వ్యూయర్స్ కి మాత్రం అసలు సిసలు మజా అంటే నామినేషన్స్ రోజు.. అంటే మండే.. మండే నిజంగానే హౌజ్ మండిపోయింది.. ఆగ్రవేశాలతో ఊగిపోయింది.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు కంటెస్టెంట్స్..

కంటెస్టెంట్స్ అందరిని రెండు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్.. అవతల టీమ్ లోని నచ్చని వ్యక్తులపై రంగు పూసి ఎందుకు నచ్చలేదో వివరించాలని సూచించాలని టాస్క్ ఇచ్చాడు.. దీంతో, పలువురు కంటెస్టెంట్స్ పై రెచ్చిపోయారు.. శని, ఆదివారాలలో కంటెస్టెంట్స్ మధ్య ఎంతటి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినా సోమవారం మాత్రం మాటల యుద్ధం మొదలుపెట్టారు…

ముఖ్యంగా గతంలో కంటే కాస్త ఎక్కువగానే స్టార్ యూ ట్యూబర్ షన్ను నోరు తెరిచినట్లు కనిపిస్తోంది.. ఆయన ఇక తన గేమ్ ని మొదలు పెట్టినట్లు అర్ధం అవుతోంది.. నాగ్ సార్ వార్నింగ్ పనిచేసిందో లేక, ఏంట్రా ఇది తనకే అనిపించిందో తెలియదు కానీ, షన్ను…. ఉమాదేవిని నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది.. ఆమెపై తీవ్ర అభియోగాలు మోపకపోయినా…. తనదయిన స్టయిల్ లో ఉమాదేవికి కార్నర్ చేశాడు షన్ను.. ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో షన్ను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ బాగా వైరల్ అయింది.. ఒక్కసారిగా హతాశయుడు అయినట్లు ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి..

ఇక హౌజ్ లో లోబో వర్సెస్ మానస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.. మానస్ ని నువ్వు హీరోవి కదా అని లోబో కౌంటర్ ఇస్తే… మానస్ కూల్ గా సమాధానం ఇచ్చాడు.. ఇటు ఉమాదేవి వర్సెస్ ప్రియాంక సింగ్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది..

వీకెండ్ లో ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చుకున్న ఈ ఇద్దరు మరోసారి ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు.. రెండు రోజుల క్రితం ఉమాదేవిని షటప్ అని తీవ్ర స్వరంతో హెచ్చరించిన ప్రియాంక సింగ్.. తాజాగా పోవే.. అని దునుమాడింది.. ఈ కామెంట్స్ తో హౌజ్ లోని ఇతర సభ్యులు సైతం నివ్వెరపోయారు..

మరోవైపు, కాజల్ ని కొందరు కంటెస్టెంట్స్ కార్నర్ చేశారు.. మొత్తమ్మీద, బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమోలు రెండు బాగా వైరల్ అయ్యాయి.. ఏ రేంజ్ లో అంటే పోస్ట్ చేసిన రెండు మూడు గంటల సమయానికే మిలియన్ వ్యూస్ ని రాబట్టాయి.. దీంతో, సోమవారం నాటి ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది.. ఈసారి బిగ్ బాస్ టాప్ రేటింగ్స్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది..

Post Comment