వెర్రి.. పూ…. బిగ్ బాస్ లో బూతుల వర్షం.. బిత్తరపోయిన షణ్ముఖ్….!!
Latest Reality shows Small Screen Social Media Tollywood

వెర్రి.. పూ…. బిగ్ బాస్ లో బూతుల వర్షం.. బిత్తరపోయిన షణ్ముఖ్….!!

గత సీజన్ ల కంటే భిన్నంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్.. హౌజ్ లోకి ఎంటర్ అయిన వారం రోజులలోపే కంటెస్టెంట్స్ అంతా సీరియస్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యారు.. తొలి నామినేషన్లలోనే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్న కంటెస్టెంట్స్.. సెకండ్ వీక్ కి వచ్చేసరికి బూతుల పర్వానికి దిగారు… ఏకంగా పోవే, పోరా, షటప్ లతో ఆగకుండా.. వెర్రి… డ్యాష్ అని పచ్చి బూతులు తిడుతున్నారు.. వాటిని బిగ్ బాస్ టీమ్ మ్యూట్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది..

హౌజ్ నుండి బయటకు వచ్చిన సరయు.. తన విశ్వరూపం చూపించింది.. బిగ్ బాస్ బజ్ హోస్ట్ అరియానా చేసిన ఇంటర్ వ్యూలో ఒక్కో కంటెస్టెంట్ పై నిప్పులు చెరిగింది. ఇప్పటికే ఆమెకు బోల్డ్ బ్యూటీ అనే పేరుంది.. కానీ, ఆమె ఎక్కడా శృతిమించలేదు.. తన మార్క్ డైలాగులను కూడా విసరలేదు..

అనూహ్యంగా ఫ్యామిలీ సీరియల్స్ లో తల్లి, పిన్ని, ఆంటీ పాత్రలు పోషించే ఉమా దేవికి కోపం కట్టలు తెంచుకుంది.. ఆమె ఆగ్రహం కేవలం కంటెస్టెంట్స్ పై తన కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించడానికే పరిమితం అయితే పర్లేదు… కానీ, ఉమా దేవి వెర్రి… డ్యాష్ అని డైలాగ్ ని ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

నామినేషన్ ల ఎపిసోడ్ మరోసారి హీటెక్కింది.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.. ముఖ్యంగా హీరోయిన్ శ్వేతా వర్మ, సీరియల్ నటి ఉమాదేవి హద్దు మీరారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి కనీస మానవత్వం కూడా మరిచిపోయారనే విశ్లేషణలు సాగుతున్నాయి. శ్వేతా వర్మ… ఇద్దరు కంటెస్టెంట్ లను నామినేట్ చేసే క్రమంలో వారి ముఖాలపై రంగును పూసే సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు అత్యంత దారుణంగా సాగింది. సింగర్ హమీదా, కమెడియన్ లోబోకి ఆమె కలర్ పూసిన తీరు చూస్తే షాక్ అవుతారు..

అంతేకాదు, అలా పూయడం తప్పు అని, కళ్లు డ్యామేజ్ అవుతాయని ఇతర కంటెస్టెంట్స్ సర్దిచెప్పాలని ప్రయత్నించినా… ఆమె డోన్ట్ కేర్ అనడం విశేషం.. ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పినా, తాను అలా కలర్ పూయడాన్ని సమర్ధించుకోవడాన్ని హౌజ్ మేట్స్ తప్పు పట్టారు. అమానవీయ చర్యగా తేల్చి పారేసింది కంటెస్టెంట్ ప్రియా..

ఇక, ఉమా దేవి… ఊహించని బూతులతో రెచ్చిపోయింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.. ఆమె ఆ పదం ఉపయోగించినప్పుడు అంతా నివ్వెరపోయారు.. యూ ట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అయితే నోరెళ్లబెట్టాడు.. ఇతర కంటెస్టెంట్స్ చెవులు మూసుకున్నారు.. మరికొందరు బెంబేలెత్తిపోయారు.. ఆమె ఇలాంటి పదప్రయోగం చేయడం ఏంటని నిలదీశారు..

మొత్తమ్మీద, బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్ ల ఘట్టం ఎంతటి కాకను రేపాలో అంత రేపింది.. మరి, రాబోయే రోజులలో ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, మరెన్ని బూతులు వినాల్సి వస్తుందో చూడాలి..

Post Comment