అడ్డంగా దొరికిపోయిన షణ్ముఖ్.. ఏంట్రా ఇది…!!
Latest Reality shows Small Screen Social Media Trending News

అడ్డంగా దొరికిపోయిన షణ్ముఖ్.. ఏంట్రా ఇది…!!

పాపులర్ యూ ట్యూబర్ షణ్ముఖ్… బిగ్ బాస్ హౌజ్ లో తడబడుతున్నాడు.. తనకంటు స్పెషల్ గేమ్ ప్లాన్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడో లేక, కన్ ఫ్యూజ్ అవుతున్నాడో తెలియదు కానీ…. షన్ను తేలిపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.. హౌజ్ లో సింగర్ శ్రీరామ్, సీరియల్ నటుడు వీజే సన్నీ, మానస్ , యాంకర్ రవితో పోలిస్తే షణ్ముఖ్ బాగా వెనకబడుతున్నాడు.. సరైన వ్యూహం లేక మరోసారి తేలిపోయాడు షన్ను..

రీసెంట్ గా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముఖ్… ఓటింగ్ కి ముందు, ఓటింగ్ తర్వాత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. షన్నుని అడ్డంగా బుక్ చేస్తున్నాయి.. కెప్టెన్సీ టాస్క్ లో ముగ్గురు ఫైనల్స్ కి చేరారు. శ్రీరామ్, సన్నీ, శ్వేతా వర్మ… ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు.. ఓటింగ్ కి ముందు తాను వీజే సన్నీకి కెప్టెన్సీ దక్కడానికి తాను మద్దతు ఇస్తానని కామెంట్ చేసిన షన్ను.. ఆ తర్వాత ఓటింగ్ స్టేజ్ కి చేరుకోగానే సన్నీని కార్నర్ చేశాడు.. సన్నీకి వ్యతిరేకంగా ఓటు వేశాడు.. వీజే సన్నీని టార్గెట్ చేశాడు..

హౌజ్ని సమర్ధవంతంగా నడిపే సామర్ధ్యం ఇంకా సన్నీకి రాలేదని, వచ్చే వారం లేదా ఆ పై వచ్చే వారానికి సన్నీ మరింత మెరుగవుతాడని అభిప్రాయ పడ్డాడు షణ్ముఖ్.. కానీ, దీనికి కొన్ని నిముషాల ముందు… షణ్ముఖ్…. తన మద్దతు సన్నీకే అని వివరించాడు.. తనకు తానే పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది..

షన్ను తీరుపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది.. ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. షన్ను జడ్జిమెంట్ పై, ఆయన ఆటతీరుని నిలదీస్తున్నారు.. తనలో తనకే క్లారిటీ లేకుండా ప్రవర్తించడం ఏంటని అడుగుతున్నారు.. ఇదే షణ్ముఖ్ ని బిగ్ బాస్ విన్నర్ గా మారడానికి నెగిటివ్ గా మారుతుందని చెబుతున్నారు.. తాను ఇతరుల ప్రవర్తనతో వెంటనే ప్రభావితం అవుతానని యాంకర్ రవికి వివరించాడు షన్ను.. ఓటింగ్ కి ముందు, ఓటింగ్ సమయంలో.. కేవలం కొద్ది క్షణాలకే ఎలా మారిపోయాడో, అభిప్రాయం మార్చుకున్నాడో అని ట్రోల్ చేస్తున్నారు.. అందుకే, ఏంట్రా ఇది షన్ను అని ఆయన సొంత పాపులర్ డైలాగుతోనే నిలదీస్తున్నారు.. షన్నుకి బయట ఎంత పాపులారిటీ ఉన్నా.. సరైన వ్యూహం లేకపోతే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయని అభిప్రాయ పడుతున్నారు.. మరి, ఇది షన్ను గేమ్ ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి..

Post Comment