తెర పైకి మా బిల్డింగ్ అమ్మకం.. ముదురుతున్న మా వివాదం
Latest Movies Tollywood

తెర పైకి మా బిల్డింగ్ అమ్మకం.. ముదురుతున్న మా వివాదం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వివాదం రోజురోజుకు ముదురుతుంది. రోజుకో ట్విస్ట్ తో మరింత రసవత్తరంగా సాగుతుంది. అయితే.. ఇటవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ లో మోహన్ బాబు మాట్లాడుతూ… అప్ప‌ట్లో కొన్న మా బిల్డింగ్ ని అమ్మేశారు. అది ఎందుకు అమ్మేశారు.? అని సూటిగా ప్ర‌శ్నించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇది వ‌ర‌కు మాకు సొంతంగా ఓ ఆఫీస్ ఉండేది. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో 90 ల‌క్ష‌ల‌కు రెండు ఫ్లాటులు కొన్నారు.

దీని నిమిత్తం అన్ డివైడెడ్ షేర్ 145 గ‌జాలు కూడా వ‌చ్చింది. అయితే.. ఈ బిల్డింగ్ ని కేవ‌లం 35 ల‌క్ష‌ల‌కు అమ్మేశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ విలువ సుమారు కోటిన్న‌ర ఉంటుంద‌ని అంచ‌నా. మోహన్ బాబు ప్రశ్నకు మెగా బ్రదర్ నాగ‌బాబు ధీటైన స‌మాధానం ఇచ్చారు. దీంతో మోహన్ బాబు వెర్సెస్ నాగబాబు అన్నట్టుగా తయారైంది. ఇంతకీ నాగబాబు ఏం చెప్పారంటే…మోహ‌న్ బాబు గారు నా పేరు ప్ర‌స్తావించ‌లేదు కానీ.. ఆ ఆఫీసు నేను అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడే కొన్నాం. ఆ త‌ర‌వాత‌ ప‌దేళ్ల‌కు శివాజీరాజా అధ్య‌క్షుడిగా, న‌రేష్ సెక్ర‌ట‌రీగా ఉన్న‌ప్పుడు వివిధ కార‌ణాలు చెప్పి ఆ ఫ్లాట్ ని కేవ‌లం 35 ల‌క్ష‌ల‌కే అమ్మేశారు.

ఇప్పుడు ఆ ఫ్లాట్ ధ‌ర క‌నీసం కోటిన్న‌ర ఉంటుంది. ఆ ఫ్లాట్ ని ఎందుకు అమ్మేశారో.. న‌రేష్ నే అడ‌గండి. న‌రేష్ ఇప్పుడు మీ ప్యాన‌ల్ కే స‌పోర్ట్ చేస్తున్నారు క‌దా? ఇక మీద‌ట ఈ ప్ర‌శ్న న‌న్ను అడిగితే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటూ తదనైన స్టైల్ లో సమాధానం చెప్పారు నాగబాబు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒక ప్యానల్ లో ఉన్న వాళ్లు మరో ప్యానల్ లోకి జంప్ అవ్వడం.. బట్టి మా ఎన్నికలు ఎంత సీరియస్ గా ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయో అర్ధం అవుతుంది. ఇదంతా చూస్తున్న సినీ పెద్దలు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఎన్నికలు జరిగే లోపు ఇంకెన్ని ట్విస్టులు, ఇంకెన్ని వివాదాలు తెర పైకి వస్తాయో..? అనేది ఆసక్తిగా మారింది.

Post Comment