సరయుకి 7 రోజుల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…!!
Latest Reality shows Small Screen

సరయుకి 7 రోజుల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…!!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి తొలి వికెట్ పడింది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టగా, ఒకరు బయటకు వచ్చారు.. బోల్డ్ బ్యూటీ సరయు హౌజ్ నుండి అవుట్ అయింది.. సెవెన్ ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ లో బోల్డ్ వీడియోస్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ… సెవెన్ డేస్ లో బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది..

ఆ మేటర్ పక్కనపెడితే, బిగ్ బాస్ హౌజ్ లో ఏడు రోజులు గడిపి బయటకు వచ్చింది.. అంటే వారం రోజులకి ఆమె రెమ్యూనరేషన్ ఎంత అనే అంశంపై సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ నడుస్తోంది. గాసిప్ రాయుళ్ల పుకార్ల ప్రకారం.. సరయుకి 80 వేల నుండి లక్ష రూపాయలు పారితోషికం అందిందని ప్రచారం జరుగుతోంది..

అయితే, ఇది బిగ్ బాస్ హౌజ్ లో వారం రోజులు ఉన్నందుకే కాదని, దీనికి రెండు వారాల ముందే ఆమె క్వారంటైన్ కి చేరిందని ఆ రెండు వారాలకు కూడా కలిపి రెమ్యూనరేషన్ లక్ష రూపాయల వరకు ఉందని అభిప్రాయ పడుతున్నారు.. అంటే, ఆమెకి వారానికి ముప్పై వేల నుండి నలబై వేల రూపాయల పారితోషికం అందిందన్న మాట..

ఈ రూమర్ లు కాస్త రీజనబుల్ గా అనిపిస్తున్నాయి.. సీజన్ ప్రారంభానికి ముందు నుండే ఆమెకి వారానికి ముప్పై వేలు ఇవ్వనున్నారనే లీకులు బయటకు వచ్చాయి.. అయితే, హౌజ్ నుండి వచ్చాక వారానికి లెక్కగా తేల్చారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌజ్ లో ఎంటర్ అయితే పాపులారిటీ, ఫేమ్ తోపాటు పారితోషికం కూడా భారీగానే ముట్టనుందని మరోసారి అర్ధం అవుతోందని గుర్తు చేస్తున్నారు ఎనలిస్టులు..

బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక, ఏ మీడియా చానెల్ కి ఇంటర్ వ్యూ ఇవ్వలేదు సరయు.. బిగ్ బాస్ బజ్ కోసం అరియానాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో తన విశ్వరూపం ప్రదర్శించిన సరయు… రాబోయే రోజులలో ఎలాంటి బాంబులు పేలుస్తుందో చూడాలి..

Post Comment