సినిమా పరిశ్రమలకు ఓటిటి రూపంలో కొత్త మార్కెట్ వచ్చిందనుకున్నారు. మొదట్లో బానే ఉన్నా.. తర్వాత ఈ మార్కెట్ మొత్తానికే ఎసరు పెట్టేస్తోంది. ఆ మేటర్ ఎలా ఉన్నా.. కొన్నాళ్లుగా.. సినిమా థియేటర్ కు, ఓటిటికి అస్సలు పడటం లేదు. యస్.. ఒక చోట హిట్ అయిన సినిమా మరో చోట ఆకట్టుకోవడం లేదు.

అంటే థియేటర్స్ లో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాలేవీ ఓటిటిల్లో మెప్పించడం లేదు. అలాగే ఓటిటిలో అద్భుతమైన అప్లాజ్ తెచ్చుకున్న సినిమాలు వెండితెరపై మాత్రం వెలవెలబోతున్నాయి. ఓ రకంగా ఇదో సెంటిమెంట్ గా మారింది. ఆ సెంటిమెంట్ ను బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్ గా రికార్డులు క్రియేట్ చేసిన కాంతార కూడా తప్పించుకోలేకపోయింది.


కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార వాల్డ్ వైడ్ గా 350 కోట్ల వరకూ కలెక్ట్ చేసి కంటెంట్ కు ఉన్న కెపాసిటీ తెలియజేసింది. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. చాలా సహజమైన కథ, కథనాలతో వచ్చిన కాంతార ట్రెడిషనల్ గా ఇన్ డైరెక్ట్ గా అన్ని ప్రాంతాల వారినీ కనెక్ట్ చేయగలిగింది.

ఈ మూవీ విజయంలో ఇదీ ఓ కీలకమైన పాయింట్ గా చెప్పాలి. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. అన్ని కలిసి కాంతారను కన్నడ ఇండస్ట్రీలోనే ఓ ఎపిక్ గా మార్చాయి. అలాటి సినిమాను ఇప్పుడు అస్సలు బాలేదు అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ మొదలయ్యాయి.


యస్.. ఓటిటిలో చూసిన చాలామంది జనం.. ఏముందీ సినిమాలో.. ఆ ఫస్ట్ ఎపిసోడ్, క్లైమాక్స్ లేకపోతే సాధారణ కమర్షియల్ సినిమానే కదా అని తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. దీంతో ఆ కమెంట్స్ చూసిన వారంతా.. సర్ ప్రైజ్ అవుతున్నారు.

అలా థియేటర్స్ లో హిట్ అయిన ఈ సినిమా ఓటిటిలో మాత్రం తేలిపోయినట్టే అనుకోవచ్చు. అయితే ఇదే సినిమాను థియేటర్స్ లో చూస్తేనే ఆ ఎక్స్ పీరియన్స్ వస్తుంది. ఇంట్లో బుల్లితెరపై ఆ ఫీల్ కనెక్ట్ కాదనే చెప్పాలి.