ఏపీలో ఏ సినిమాకైనా ఒకటే రేటు.. నిర్మాతలందరికీ అదే డౌటు..!
Latest Movies Tollywood

ఏపీలో ఏ సినిమాకైనా ఒకటే రేటు.. నిర్మాతలందరికీ అదే డౌటు..!

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్లు రేట్లు తగ్గించడం.. పెద్ద సినిమాలకు మొదటి మూడు రోజులు టిక్కెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కూడా లేదని.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు.. అన్ని రోజుల్లో.. ఒకటే రేటు అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ ఆలోచనలో పడింది. ఏపీ సీఏం జగన్ తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందని.. ఈ మీటింగ్ లో అన్ని విషయాలు చర్చకు వస్తాయని.. సీఏం సానుకూలంగా స్పందిస్తే.. వరుసగా భారీ సినిమాలు రిలీజ్ చేయాలి అనుకున్నారు.

అయితే.. ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ పెద్దల మీటింగ్ జరిగింది కానీ… సీఎంతో సినీ పెద్దల మీటింగ్ జరగలేదు. మంత్రి పేర్ని నాని సీఎంతో మాట్లాడి త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల మంత్రితో జరిగిన మీటింగ్ గురించి సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలు తీరతాయని.. ఇండస్ట్రీ మళ్లీ కళకళలడడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే… బయటకు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ.. సీఎం మనసులో మాత్రం చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకటే టిక్కెట్ రేటు ఉండాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదే కనుక జరిగితే… భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలకు భారీగా నష్టమే. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియచేశారు. ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది కానీ.. ఇప్పుడున్న రేట్లతో రిలీజ్ చేయలేం. అలా చేస్తే నిర్మాతకు నష్టం వస్తుంది. అందుచేత ఇద్దరు సీఏంలు సానుకూలంగా తమ సమస్యలను అర్ధం చేసుకోవాలని కోరడం జరిగింది. మరి.. మన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

One Comment

Post Comment