సమంతకు ఈ సారి అంత ఈజీ కాదు

తెలుగు సినిమా పరిశ్రమలో మోనార్క్ లు చాలామందే ఉన్నారు. అంటే క్రియేటివ్ గా పేరు తెచ్చుకుని అందుకోసం ఎవరి మాటా వినరు. ట్రెండ్ కు భిన్నంగా ఉన్నా.. తాము నమ్మినదాన్ని అచ్చంగా ఆచరిస్తారు. అలాంటి వారిలో నిన్నటి తరం దర్శకుడు గుణశేఖర్ కూడా ఉంటారు.

కొన్నాళ్ల క్రితం రుద్రమదేవి చిత్రంతో ఆర్థికంగా కూడా లాస్ అయిన అతను తర్వాత కాళిదాసు కావ్యం ఆధారంగా శాకుంతలం అనే సినిమా చేశారు. సమంత టైటిల్ రోల్ లో నటించిన ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు కూడా. బట్ రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు మరో సారి కొత్త డేట్ అనౌన్స్ చేశారు. మరి ఈ సారైనా వస్తారా .. ?


రీసెంట్ గా యశోద చిత్రంతో మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది సమంత. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ రెస్ట్ తీసుకుంటోంది. ఈ కారణంగానే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. పైగా ఒప్పుకున్నవి కూడ వదులుకుంటోంది. ఇదేమీ ప్రాణాపాయం ఉన్న సమస్య కాదు. కానీ మేకప్ ను భరించలేని సమస్య. అందుకే తను ఇప్పుడప్పుడే మేకప్ వేసుకుంటుందని అనుకోలేం.

అయితే గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన శాకుంతలం రిలీజ్ డేట్ తో మరోసారి సమంత వార్తల్లోకి వచ్చింది. అంటే ఈ మూవీకి అన్నీ తనే. మేల్ లీడ్ లో నటించిన అతను మళయాలీ. సో.. గుణశేఖర్ తర్వాత సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే సమంత బయటకు రావాల్సిందే. తను ప్రమోషన్స్ చేయకపోతే ఖచ్చితంగా గుణశేఖర్ లాస్ అవుతాడు.

ఒకేవళ తను ప్రమోషన్స్ చేసినా సినిమాలో పస లేకపోతే అది వేరే సంగతి. బట్ ముందు అంచనాలు పెంచి ఓపెనింగ్స్ వరకూ తెచ్చుకోవాలి కదా..? అందుకే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సమంత గత యశోద సినిమాలానే ఒకటీ అరా ఇంటర్వ్యూతో సరిపెడుతుందా లేక పూర్తి స్థాయిలో బయటకు వస్తుందా అనేది కూడా తెలిసిపోతుంది.

నిజానికి నవంబర్ నుంచి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడానికి కారణం కూడా అదే అంటారు. తను బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడితే తప్ప వర్కవుట్ కాదని గుణశేఖర్ తెలుసు. అందుకే సమంత సరిగ్గా ఉన్నప్పుడే విడుదల చేయాలనుకున్నాడు. అందుకోసం ఫిబ్రవరి 17ను ఎంచుకున్నాడు. ఈ సారి ఆ డేట్ లో వస్తున్నాం అని అనౌన్స్ చేశాడు. అయితే ఆ రోజు వీరికి గట్టి పోటీయే ఉంది. ధనుష్‌ నటించిన సార్ తో పాటు విశ్వక్ సేన్ ధమ్కీ, కిరణ్ అబ్బవరపు వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాలు ఫిబ్రవరి 17నే విడుదలవుతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకోవాలంటే సమంత ప్రమోషన్స్ చేయాల్సిందే. లేదంటే మరోసారి పోస్ట్ పోన్ తప్పదు అంటున్నారు విశ్లేషకులు.

Related Posts