చైతుతో విడాకులే.. ట్వీట్ తో క్లారిటీ ఇచ్చిన సమంత…!!
Latest Movies Tollywood

 చైతుతో విడాకులే.. ట్వీట్ తో క్లారిటీ ఇచ్చిన సమంత…!!

టాలీవుడ్ స్టార్ కపుల్.. అక్కినేని యువ హీరో నాగచైతన్య, సమంత మధ్య ఏం జరుగుతోంది..?? ఈ స్టార్ జంట విడిపోవడానికి రెడీ అవుతోందా…?? ఇద్దరి మధ్య పూడ్చలేనంత గ్యాప్ వచ్చిందా..? ఇద్దరూ ఇక కలిసి కాపురం చేయడం, కలిసి జీవించడం అసాధ్యమా..??. దీనిపై రోజురోజుకీ కాస్త క్లారిటీ వస్తోందని చెబుతున్నాయి ఫిలిం నగర్ వర్గాలు..

రీసెంట్ గా నాగ చైతన్య లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ రిలీజ్ అయింది.. ఈ ట్రయిలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఫిదా వంటి సంచలన విజయం తర్వాత విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల నుండి డెలివర్ అవుతోన్న మూవీ ఇది.. ఇటు ఫిదా ఫేమ్ సాయి పల్లవి ఈ మూవీలో హీరోయిన్.. పక్కా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి..

ఈ సినిమా ట్రయిలర్ సాక్షిగా మరోసారి నాగచైతన్య – సమంత మధ్య గ్యాప్ బయటపడిందని చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు.. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయిన తర్వాత హీరోయిన్ సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ విన్నర్.. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ అని ట్వీట్ చేసింది చుల్ బులీ.. హీరో, భర్త నాగచైతన్యని ట్యాగ్ చేయలేదు.. గత కొన్నిరోజులుగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు, ఇమేజెస్, వీడియోలు… తన భర్తతో గ్యాప్ ని చెప్పకనే చెబుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. లవ్ స్టోరీ ట్రయిలర్ విడుదలతో దానిపై మరింత క్లారిటీ వచ్చిందని విశ్లేషణలు సాగుతున్నాయి..

మరోవైపు, చైతు, సమంత కలిసి ఉండడం లేదని, కొన్ని రోజులుగా ఎవరి వారి వారిదే అని ప్రచారం జరుగుతోంది.. సమంత చెన్నైలో నివాసం ఉంటుండగా, చైతు హైదరాబాద్ లో నివసిస్తున్నాడట.. మరి, ఈ వార్తలలో ఎంతవరకు నిజమో, ఎప్పుడు క్లారిటీ వస్తుందో అనేది త్వరలోనే తేలనుంది..

Post Comment