సమంత కెరీర్ కు శాకుంతలం ఓ లిట్మస్ టెస్ట్ ..?

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు దాదాపు విజయశాంతితోనే కాలం చెల్లింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమె రూట్ లో ఆ తర్వాతి తరం హీరోయిన్లైన రోజా, రమ్యకృష్ణ వంటి వారు ప్రయత్నించినా.. వీరు సోలోగా ఓపెనింగ్స్ తెచ్చుకుని సత్తా చాటింది లేదు. ఓ దశలో సౌందర్య కూడా ట్రై చేసింది. బట్ భారీ హిట్స్ పడలేదు. విజయశాంతి తర్వాత సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక బ్యూటీ నయనతార మాత్రమే. ఆమె సినిమాకు ఓ మీడియం రేంజ్ హీరోకు వచ్చినంత ఓపెనింగ్స్ వస్తున్నాయి.

పైగా ఏ మాత్రం గ్లామర్ ఊసు లేకుండా సినిమా అంతా తనే నడిపించగల నటన కూడా చూపిస్తోంది. అందుకే అమ్మడి థర్డ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్స్ తో సాగి సూపర్ స్టార్ ఇమేజ్ ను తెచ్చింది. ఇప్పుడు ఆ ప్రయత్నంలో సమంత కూడా ఉంది. మరి సమంతకు ఆ స్థాయి ఉందా..? అంటే సమాధానం ప్రశ్నార్థకమే అని చెప్పాలి.
నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత చకచకా కొత్త ప్రాజెక్ట్స్ కు సంతకాలు చేసింది.

వాటి నుంచి ముందుగా వచ్చిన యశోద ఏమంత ప్రభావం చూపించలేదు. పైగా ఈ మూవీ రిలీజ్ కు ముందు తన మయోసైటిస్ వ్యాధి, ఇతర స్ట్రగుల్స్ ను కూడా ప్రమోషన్స్ వాడేసింది. అవి కొంత వరకూ అటెన్షన్ తెచ్చినా.. అసలుగా చూస్తే యశోదను బ్లాక్ బస్టర్ చేయలేకపోయాయి. ఇక ఇప్పుడు శాకుంతలంగా వస్తోంది సమంత. ఒకప్పుడు అయితే ఏమో కానీ ఇప్పుడు మారిన తన ఇమేజ్ తో పోలిస్తే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా తేడా కొడుతుంది అనేది ట్రేడ్ అంచనా.


గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం చిత్రం ప్రమోషన్స్ లో కూడా సమంత ‘పాత’విషయాలతోనే సింపతీ కొట్టేయాలని చూస్తోందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వర్గం ఫైర్ అవుతోంది. మరోవైపు శాకుంతలం అనే పీరియాడిక్ పాత్రకు సమంత సెట్ అవదు అంటూ నెగెటివ్ రాయుళ్లూ రెచ్చిపోతున్నారు. నటన పరంగా సమంతకు వంకలు పెట్టాల్సిందేం ఉండదు.

కానీ ఆ పాత్ర స్టేచర్ ను తను మోయగలదా అనేదే పెద్ద ప్రశ్న అంటున్నారు. ఎందుకంటే శాకుంతలం కల్పిత పాత్రే అయినా.. ఆమెకు పుట్టిన బిడ్డ పేరు మీదుగానే ఈ దేశానికి భరత దేశం అనే పేరు వచ్చిందని జనాలు నమ్ముతారు. అలాంటి క్యారెక్టర్ ను బేలన్స్డ్ గా మోయడం పెద్ద సవాల్. ఇప్పటికే సమంత ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఈ పదేళ్లలో తను చేయని పాత్ర లేదు. ఎక్స్ పోజింగ్ పరంగా అయితే చెప్పక్కర్లేదు. బలమైన పాత్రల్లోనూ మెప్పించింది. ఈ రెండూ మిక్స్ అయి ఉన్న రోల్స్ మాత్రం లేవు అనే చెప్పాలి.


మరోవైపు తను ప్రధాన పాత్రగా కనిపించిన యూ టర్న్ అనే థ్రిల్లర్ కూడా పెద్దగా ఆడలేదు. ఓవరాల్ గా చూస్తే శాకుంతలం సినిమాలో సమంత తప్ప మరో హైలెట్ ఏం కనిపించడం లేదు. సో.. సినిమా ఆడితే సోలో హీరోయిన్ గా సమంతతో మరిన్ని సినిమాలు వస్తాయి. లేదంటే ఈ చిత్రమే ఆమె లాస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ అవుతుంది. ఖచ్చితంగా చెబితే నయనతారలా తను రాణిస్తుందా లేదా అనేది తేల్చే లిట్మస్ టెస్ట్ గా శాకుంతలం సినిమా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ నెల 14న విడుదలవుతోన్న ఈ చిత్రంతో తను ఎలాంటి రిజల్ట్ చూస్తుందో చూడాలి.

Related Posts