Virupaksha : సెంచరీ కొట్టిన సాయితేజ్ విరూపాక్ష

లైఫ్ లో చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయిధరమ్ తేజ్. ప్రమాదం తర్వాత చేసిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్షన లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది.

సంయుక్త హీరోయిన్. కంప్లీట్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి ఆటకేబ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఓపెనింగ్స్ సాధారణంగా ఉన్న.. ఫస్ట్ డే మౌత్ టాక్ తో మరో రేంజ్ కు వెళ్లిపోయిందీ మూవీ.

25 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ టాక్ చూసి.. బ్లాక్ బస్టర్ అన్న తర్వాత యాభై కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు విశ్లేషకులు. బట్ వారి అంచనాలను దాటి 60, 70, 80 ఇలా పెరుగుతూనే పోయింది. తర్వాత వచ్చిన సినిమాలేవీ హిట్ టాక్ తెచ్చుకోలేకపోవడం కూడా విరూపాక్షకు ప్లస్ అయింది. బలమైన కంటెంట్ కూడా ఉండటంతో బాక్సాఫీస్ షేక్ అయిందనే చెప్పాలి.

ఇక ఫైనల్ గా ఏ మీడియం రేంజ్ హీరోకైనా డ్రీమ్ రన్ గా భావించే వంద కోట్ల పోస్టర్ తెచ్చుకుంది విరూపాక్ష. యస్.. ఈ బుధవారంతో తెలుగు వెర్షన్ లోనే 100 కోట్ల మార్క్ ను టచ్ చేసి సత్తా చాటింది.
ఇక ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లేఅందించాడు. అదే పెద్ద హైలెట్ అయింది. అఫ్‌ కోర్స్ అందులో దర్శకుడి హ్యాండ్ కూడా ఉంది. ఇక తను అనుకున్న కంటెంట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అనవసరమైన హీరోయిజం, డ్యూయొట్స్, కామెడీ ట్రాక్స్ అంటూ ఏం లేకుండా దర్శకుడు బలంగా తను చెప్పాలనుకున్నది చెప్పాడు.

అటు సాయితేజ్ కూడా డైరెక్టర్ కు స్టిక్అయిపోయాడు. హీరోయిన్ పాత్ర ఈ మధ్య కాలంలో ఇంత స్ట్రాంగ్ గా ఉండటం ఇదే అని చెప్పాలి. ఓవరాల్ గా థ్రిల్లర్ మూవీ లవర్స్ ను మాత్రమే కాక ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పించి మరీ భయపెట్టిన విరూపాక్ష వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
.

Related Posts