విరూపాక్ష ఇంత పెద్ద బరువు మోయగలడా ..?

స్టార్డమ్ రావడం వేరు. మార్కెట్ పెరగడం వేరు. స్టార్ హీరో అనే ట్యాగ్ ను దాటి టాప్ హీరో అనిపించుకోవాలంటే ఈ మార్కెట్ పెరగాలి. ప్రతి సినిమాకూ మార్కెట్ రేంజ్ పెరుగుతూనే ఉండాలి. అలా జరగాలంటే ఒక సినిమా రిలీజ్ కు ముందు జరిగిన బిజినెస్ ఎంత..? దాన్ని ఈ హీరో సాధించాడా లేదా అనేదే క్రైటీరియా. అలా చూస్తే ఇప్పుడు విరూపాక్ష రూపంలో సాయిధరమ్ తేజ్ పై పెద్ద బరువే ఉంది. ఇప్పటికే సినిమాపై ఏ మాత్రం బజ్ లేదు. పైగా ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలోనే చాలా వచ్చాయి. అటు హారర్ కాదు, ఇటు థ్రిల్లర్ కాదు అని చెబుతూ వస్తోంది మూవీ టీమ్. దీన్ని బట్టి ఇది క్లాస్ ఆడియన్స్ కు చేరే సినిమా కాదు. అలా అని మాస్ లో తేజ్ కు ఓ రేంజ్ క్రేజ్ లేదు కాబట్టి.. అటూ వర్కవుట్ అవుతుందనుకోలేం. మరోవైపు ట్రైలర్ చూస్తే చాలా యావరేజ్ గా ఉంది. ఇలాంటి టైమ్ లో ఒక సినిమా థియేట్రికల్ బిజినెస్ ను దాటి విజయ తీరాలు చేరాలంటే చాలా కష్టం. ఆ కష్టంలోనే ఉన్నాడు విరూపాక్ష.


ఈ చిత్రానికి అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ 21 కోట్లు. ఓవర్శీస్ లో మూడు కోట్లు. అంటే మొత్తం 24 కోట్ల టార్గెట్ తో విరూపాక్ష ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. బట్ ఇప్పటి వరకూ సాయిధరమ్ తేజ్ కు ఈ రేంజ్ మార్కెట్ లేదు. ఇంకా చెబితే అతని రేంజ్ కు ఇది చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని సాధించడం అంటే సినిమాలో అద్బుతాలు ఉండాలి. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించినంత మాత్రాన బ్లాక్ బస్టర్ అయిపోతుందనుకోలేం కదా.. ?అలా చూస్తే సాయిధరమ్ కు ఈ బిజినెస్ ను ఛేదించడం చాలా పెద్ద టాస్క్. మరి ఈ టాస్క్ లో అతను గెలుస్తాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో మొదటి ఆటకు వచ్చే పబ్లిక్ టాను చూస్తే తేలిపోతుంది.

Related Posts