“ఆర్ఆర్ఆర్” థీమ్ సాంగ్ సెటప్ సూపర్బ్
Bollywood Latest Movies Tollywood

“ఆర్ఆర్ఆర్” థీమ్ సాంగ్ సెటప్ సూపర్బ్

ఆర్ఆర్ఆర్ మూవీ గ్రాండియర్, క్రేజ్ కు తగినట్లే ప్రమోషన్ బిగిన్ చేసింది చిత్ర బృందం. అల్లూరి, భీమ్ టీజర్ లు రిలీజ్ చేశాక, ఫస్ట్ లుక్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులకు అమోజింగ్ ఎక్సీపిరియన్స్ అందించింది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి మరో భగీరథ ప్రయత్నమే చేసినట్లు ఈ ఫుటేజ్ చూపించింది. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి థీమ్ సాంగ్ రెడీ చేస్తున్నారు. ఈ థీమ్ సాంగ్ ను 5 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

స్నేహం గొప్పదనం గురించి సాగనున్న ఈ పాటను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రికార్డ్ చేస్తున్నారు. ఈ పాట సినిమాలో చివరలో టైటిల్స్ కార్డ్ దగ్గర ప్లే అవుతుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ డ్రామాకు చివరి పంచ్ గా ఈ పాట ఉండబోతోంది. ఐదు భాషల్లో ఐదుగురు పేరున్న గాయకులు ఈ థీమ్ సాంగ్ ను పాడబోతున్నారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచంద్రన్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాసిర్ నాజిర్ ఈ పాటను పాడారు. ఆగస్టు 1న ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ పాట షూట్ కోసం ప్రత్యేక సెట్ వేశారు. ఆర్ఆర్ఆర్ టైటిల్స్ డిజైన్ లో కనిపించే రెండు చేతుల కరచాలనం ఫొటోస్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. స్వాతంత్రోద్యమం ముందు ఇద్దరు యోధులు బ్రిటీష్ వారితో ఎలా పోరాడారు అనేది ఆర్ఆర్ఆర్ నేపథ్యంగా ఉండనుంది. ఈ ప్యాన్ వరల్డ్ సినిమా అక్టోబర్ 13న తెరపైకి రానుంది. ఈ మూవీ సోషల్ మీడియా అక్కౌంట్స్ లోనూ రిలీజ్ డేట్ ఉన్న ఫొటోనే డీపీగా వాడుతున్నారు. అంటే సినిమా విడుదల మీద గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

Post Comment