“ఆర్ఆర్ఆర్” త‌గ్గేదేలే.. ప్రీమియ‌ర్స్ అంతా సిధ్ధం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. క‌రోనా కార‌ణంగా చాలా సార్లు వాయిదా ప‌డింది. అయితే.. ఇప్పుడు అంతా బాగానే జ‌రుగుతుంది అనుకుంటుంటే.. ఒమిక్రాన్ అంటూ టెన్ష‌న్ మొద‌లైంది. నార్త్ లో కొన్ని చోట్లా నైట్ క‌ర్ఫ్యూలు పెట్ట‌డం జ‌రిగింది. ఢిల్లీలో సినిమా హాల్లు మూత‌ప‌డ్డాయి.

దీంతో ఆర్ఆర్ఆర్ అనుకున్న‌ట్టుగా జ‌న‌వ‌రి 7న వ‌స్తుందా..? మ‌ళ్లీ వాయిదా ప‌డుతుందా..? అనేది ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యం గురించి రాజ‌మౌళిని అడిగితే.. త‌గ్గేదేలే.. అన్న‌ట్టుగా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవుతుంద‌ని.. ఎలాంటి మార్పులేద‌ని చెబుతున్నారు. నిన్న కేర‌ళ‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ లో రాజ‌మౌళి మాట్లాడుతూ.. జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ వ‌స్తుంద‌ని మ‌రోసారి క‌న్ ఫ‌ర్మ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ ప్రీమియ‌ర్స్ ను పెద్ద ఎత్తున జనవరి 6వ తేదీన రాత్రి ప్లాన్ చేశారు. ప్రీమియర్ షో లకి అంతా సిద్ధం అన్న‌ట్టుగా అటు ఓవర్సీస్ తో పాటు ఇక్కడ మన దగ్గర కూడా రెడీ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనిని బ‌ట్టి ఆర్ఆర్ఆర్ ఎట్టి ప‌రిస్థితుల్లోను వాయిదా ప‌డే స‌మ‌స్యే లేదు అని తెలుస్తోంది.

Related Posts