RRR :జపాన్ లో ఆర్ఆర్ఆర్ సంచలనం.. ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్

ఆర్ఆర్ఆర్ గతేడాది విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డ్‌స్ ను సాధించింది. ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న అవార్డ్స్ ను కొల్లగొట్టింది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్(Oscar) కూడా సాధించి అదరహో అనిపించిందీ చిత్రం.

ముఖ్యంగా ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) నటనకు ప్రపంచం ఫిదా అయింది. బాహుబలితో మన మేకింగ్ కెపాసిటీని ప్రపంచానికి చూపించిన రాజమౌళి(Raja Mouli). ఆర్ఆర్ఆర్ తో మన యాక్టింగ్ దమ్మేంటో కూడా చూపించాడు. ముఖ్యంగా తెలుగోడి సత్తా తెలిసేలా చేశాడు.

ప్రపంచంలో అనేక దేశాల్లో అద్భుతం అని ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి జపాన్ నుంచి మాత్రం అరుదైన రికార్డ్స్ వచ్చాయి.
మామూలుగా సౌత్ ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి ఆదరణ ఉంటుంది. వాళ్లు రజినీకాంత్(Rajinikanth) ను ఆరాధించినంత పని చేస్తారు. రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా అక్కడ ఏకంగా 400 మిలియన్ యెన్ లు కలెక్షన్స్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది.

అలాంటి వారిని తెలుగు హీరోల వైపు టర్న్ చేశాడు రాజమౌళి. ఇన్నేళ్ల తర్వాత ముత్తు రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ చెరిపేసింది. బాహుబలితో జక్కన్న ఫ్యాన్స్ అయిపోయిన జపనీస్ ను మరోసారి ఆర్ఆర్ఆర్ తో మెస్మరైజ్ చేశాడు రాజమౌళి.

2022 అక్టోబర్లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడీ చిత్రానికి. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన ఏకంగా ఫిబ్రవరి వరకూ 200 కేంద్రాల్లో వంద రోజులు ఆడేలా చేసింది. ఇక అక్కడితో ఆగుతుందీ అనుకుంటే అంతకు మించిన అరుదైన మరో రికార్డ్ ను కూడా ఇచ్చారు జపనీస్. తాజాగా 102 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శన పూర్తి చేసుకుని షాకింగ్ రికార్డ్ నెలకొల్పింది.

నిజానికి ఇండియాలోనే ఈ రికార్డ్ ఏ సినిమాకూ లేదు. అలాంటిది విదేశంలో సాధిచడం అంటే అదంతా రాజమౌళి అండ్ టీమ్ గొప్పదనంగానే చూడాలి. మరి రికార్డ్స్ ఇక్కడితో ఆగుతాయా ఇంకా కొనసాగుతాయా అనేది చూడాలి.

Related Posts