“ఆర్ఆర్ఆర్” ఎఫెక్ట్.. ఈసారి ప్లాన్ మార్చిన ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది వాయిదా ప‌డింది. అయితే.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడు సంవ‌త్స‌రాలు పాటు మ‌రో సినిమా చేయ‌లేదు. ఈ మూవీకే ఫిక్స్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సార్లు వాయిదా ప‌డిన ఆర్ఆర్ఆర్ మ‌రోసారి వాయిదా ప‌డ‌డంతో ఎన్టీఆర్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. త‌న నెక్ట్స్ మూవీస్ విష‌యంలో ప్లాన్ మార్చార‌ని టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుద‌ల గురించి క్లారిటీ లేక‌పోవ‌డంతో ఆర్ఆర్ఆర్ విడుద‌ల కాకుండానే.. కొర‌టాల‌తో చేయ‌నున్న మూవీ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా.. ఈసారి రెండు సినిమాలు ఒకేసారి చేయాలి అనుకుంటున్నార‌ని స‌మాచారం. కొర‌టాల శివ‌తో ఓ సినిమా.. మ‌రి.. మ‌రో సినిమా ఎవ‌రితో చేయ‌నున్నాడు అంటే.. బుచ్చిబాబు సానా పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది.

ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన‌ బుచ్చిబాబు సానా ఎప్పుడో ఎన్టీఆర్ కి క‌థ చెప్ప‌డం జ‌రిగింది. క‌థ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది. కాక‌పోతే ఎన్టీఆర్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామ‌నేది ఇన్నాళ్లు చెప్ప‌కుండా స‌స్పెన్స్ లో పెట్టారు. ఇప్పుడు ఆ స‌స్పెన్స్ కు తెరదించి బుచ్చిబాబు సినిమాను కూడా ఎన్టీఆర్ ప‌ట్టాలెక్కించాలి అనుకుంటున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.