నాని సినిమా తమిళ్ మూవీకి రీమేకా..?

నేచురల్ స్టార్ గా తిరగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు నాని. వైవిధ్యమైన కథలతో తనకంటూ మంచి మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు మాస్ మూవీస్ కు సైతం సై అంటున్నాడు. రీసెంట్ గా దసరాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న నాని..

ఇప్పుడు తన కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు. శౌర్యు అనే కొత్త కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడీ చిత్రంతో. సీతారామం ఫేమ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో నడుస్తుందని ముందే చెప్పారు. ఆల్రెడీ ఈ సెంటిమెంట్ తోనే నాని చేసిన జెర్సీ మంచి రిజల్ట్ అందుకుంది. ఈ సారి కూడా అదే రిపీట్ చేస్తున్నాడు.

కాకపోతే జెర్సీలో అబ్బాయికి తండ్రి. ఈ మూవీలో అతనికి ఓ కూతురు ఉంటుంది. సినిమా సెంటిమెంట్ కు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ‘నాన్న’,‘డియర్ నాన్న’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఇది స్ట్రెయిట్ మూవీ కాదు అని.. ఓ తమిళ్ మూవీకి రీమేక్ అనేది లేటెస్ట్ గా వినిపిస్తోన్న న్యూస్.
ఈ యేడాది ఫిబ్రవరి 10న తమిళ్ లో ఓ చిత్రం విడుదలైంది. పేరు డాడా. కెవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన సినిమా ఇది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏకంగా 20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ చిన్న చిత్రం ఇంపాక్ట్ ఎలా ఉందో..? లిమిటెడ్ క్యారెక్టర్స్ తో అన్ లిమిటెడ్ ఎమోషన్ తో వచ్చిన ఈ మూవీనే తెలుగులో నానితో రీమేక్ చేస్తున్నారని టాక్. ఇదే నిజమైతే.. ఖచ్చితంగా నానికి ఇదిమరో బెస్ట్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. అతని ఇమేజ్ కు అద్భుతంగా సూట్ అయ్యే స్టోరీ ఇది. కాలేజ్ డేస్ లోనే ప్రేమలో పడిన ఓ జంట అనుకోకుండా చేసిన తప్పు వల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇద్దరి కుటుంబాలూ ఇంట్లో నుంచి వెళ్లగొడతాయి. దీంతో సొంతంగా పనిచేస్తూ ప్రెగ్నెంట్ అయిన వైఫ్ ను చూసుకుంటుంటాడు హీరో. ఈ లోగా తనకు తాగుడు అలవాటు పెరుగుతుంది. ఓ సారి తాగిన మత్తులో భార్యను కొట్టినంత పనిచేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అదే టైమ్ లో తను అతి కష్టం మీద ఓ బాబుకు జన్మనిస్తుంది. అయితే బాబును హాస్పిటల్ లోనే వదిలేసి.. తల్లితండ్రులతో వెళ్లిపోతుంది. హీరో ఎంత బతిమాలినా అతని మొహం కూడా చూడదు. దీంతో పిల్లాడిని తనే పెంచుతూ.. అమ్మ అనే మాటే గుర్తుకు రాకుండా చేస్తాడు. కట్ చేస్తే ఓ సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో జాయిన్ అయిన అతనికి తన బాస్ మాజీ భార్య అని తెలుస్తుంది. మరి అక్కడ వీరు కలిశారా.. ఎందుకు తను బాబును విడిచివెళ్లిపోయింది అనేది గుండెలు పిండిచేసేలా క్లైమాక్స్ లో ఉంటుంది. ఈ తరహా కథల్లో అయితే నాని నటనతో విజృంభిస్తాడు. అదీ కాక తెలుగులో ఇంకా ఇంప్రవైజ్ అవుతుంది కూడా. మరి ఈ నాన్న సినిమా ఆ సినిమాకు రీమేకా లేక కొత్త కథా అనేది వాళ్లే చెప్పాలి.

Related Posts