అఖండ అద్భుత విజ‌యానికి అస‌లు కార‌ణం ఇదే

ఇప్పుడు ఎవ‌రి నోట‌ విన్నా అఖండ మాటే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ తో అఖండ దూసుకెళుతుండ‌డం విశేషం. ఇంకా చెప్పాలంటే.. అంచ‌నాల‌కు మించిన క‌లెక్ష‌న్స్ తో స‌రికొత్త రికార్డులు దిశ‌గా అఖండ‌ దూసుకెళుతుంది. అయితే.. అఖండ ఇంత‌టి విజ‌యం సాధించ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అఖండ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఆత‌ర్వాత ద‌స‌రాకి వ‌స్తుంది అని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ద‌స‌రాకి కాదు.. దీపావ‌ళికి రిలీజ్ అనుకున్నారు కానీ.. దీపావ‌ళికి కూడా రాలేదు. దీంతో అఖండ సంక్రాంతికి వ‌స్తుందేమో అనే టాక్ కూడా వ‌చ్చింది. అయితే.. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయ‌క్ విడుద‌ల అవుతున్నాయి. దీంతో మెగాస్టార్ ఆచార్య‌, వెంకీ, వ‌రుణ్ ల ఎఫ్ 3 సినిమాలు ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డ్డాయి.

దీంతో బాల‌య్య అఖండ కూడా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవుతుందా అనిపించింది. కార‌ణం ఏంటంటే.. డిసెంబ‌ర్ అనేది అన్ సీజ‌న్. ఈ సీజ‌న్ లో సినిమా రిలీజ్ చేస్తే.. క‌లెక్ష‌న్స్ అంత‌గా రావు. ఒక విధంగా డిసెంబ‌ర్ 2న సినిమా రిలీజ్ చేయ‌డం అనేది రిస్క్. అయిన‌ప్ప‌టికీ.. అఖండ సినిమాను డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు మేక‌ర్స్. అయితే.. సెకండ్ వేవ్ త‌ర్వాత వ‌చ్చిన భారీ చిత్రం కావ‌డంతో అఖండ‌కు ప్ల‌స్ అయ్యింది. జ‌నాలు ఈరేంజ్ మాస్ మూవీ చూసి చాలా రోజులు అయ్యింది. దీంతో అఖండ వ‌చ్చిన వెంట‌నే.. థియేట‌ర్ల పై దాడి చేసిన‌ట్టుగా సినీ అభిమానులు అఖండ థియేట‌ర్ల పై ప‌రుగులు తీసారు. అందుకే ఈ రేంజ్ క‌లెక్ష‌న్స్. ఏది ఏమైనా.. అన్ సీజ‌న్ లోను బాల‌య్య అఖండ‌తో అద‌ర‌గొట్టేస్తుండ‌డం విశేషం.

2021లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించి స‌రికొత్త రికార్డ్ సాధించిన అఖండ‌.‌ ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే మాట అఖండ‌.. అఖండ‌. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అంచ‌నాల‌కు మించిన క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఇంత‌కీ అఖండ ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసిందంటే…

నైజాం – 4.39కోట్లు, సీడెడ్ – 4.02 కోట్లు, యు.ఎ 1.36 కోట్లు, ఈస్ట్ – 1.05కోట్లు, వెస్ట్ – 96 ల‌క్ష‌లు, గుంటూరు – 1.87 కోట్లు, కృష్ణ – 81 ల‌క్ష‌లు, నెల్లూరు – 93 ల‌క్ష‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో క‌లిపి 15.39కోట్లు షేర్ 23 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఓవర్ సీస్ లో ప్రీమియ‌ర్ షో అండ్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ తో హాఫ్ మిలియ‌న్ క్రాస్ చేసింద‌ని స‌మాచారం. సెకండ్ వేవ్ త‌ర్వాత హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన‌ తెలుగు సినిమాగా అఖండ స‌రికొత్త‌ రికార్డ్ సృష్టించింది.

Related Posts