కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి వెనుక అసలు కారణం..??
Latest Movies Regional Social Media Tollywood

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి వెనుక అసలు కారణం..??

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్ వుడ్ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం.. ఆ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు.. నిండా అయిదు పదులు కూడా లేని పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు.. ఉదయం జిమ్ చేస్తున్న పునీ రాజ్ కుమార్.. సడెన్ గా కుప్పకూలిపోయారు.. హుటాహుటిన ఆయనను బెంగళూరులోని ప్రముఖ విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.. వెంటనే ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు..

పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు లోనయ్యారనే వార్త తెలిసిన వెంటనే కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. ఆసుపత్రికి చేరుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు..

పునీత్ రాజ్ కుమార్ వయసు 46 ఏళ్లు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు.. తండ్రి రాజ్ కుమార్ శాండల్ వుడ్ తొలి సూపర్ స్టార్.. కన్నడ కంఠీరవగా గుర్తింపు తెచ్చుకున్నారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌమ ఎన్టీఆర్కి ఎంతటి క్రేజ్ ఇమేజ్ ఉందో, కన్నడ చిత్ర పరిశ్రమలో రాజ్ కుమార్ కుటుంబానికి అంతటి గుర్తింపు ఉంది.

రాజ్ కుమార్ వారసత్వం కలిసి వచ్చింది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించాడు పునీత్ రాజ్ కుమార్.. బెట్టడ హూవు చిత్రానికి జాతీయ ఉత్తమ బాలనటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు.. బాల నటుడిగా అనేక సినిమాలలో నటించిన పునీత్ రాజ్ కుమార్ ని.. హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాధ్. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఇడియెట్ మూవీని అప్పుగా రీమేక్ చేశాడు పూరి.. ఈ సినిమా అక్కడ కూడా సంచలన విజయం సాధించింది.. రికార్డులు తిరగరాసింది..

అప్పుతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్.. ఆ తర్వాత వరస విజయాలతో మాస్ హీరో ఇమేజ్ దక్కించుకున్నాడు.. సూపర్ స్టార్ గా అవతరించాడు. తండ్రి అందించిన వారసత్వాన్ని కొనసాగించడంలో సక్సెస్ అయ్యాడు.. హీరోగా 29 సినిమాలు చేశాడు. ఎన్నో హిట్స్ డెలివర్ చేశాడు.

తెలుగు చిత్ర పరిశ్రమతో పునీత్ రాజ్ కుమార్ కి మంచి అనుబంధం ఉంది.. ఆయన సినిమా కోసం రెండేళ్ల క్రితం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడలో ఓ పాట కూడా పాడారు.. ఆ పాట ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం పునీత్… హీరోగా పలు చిత్రాలు చేస్తున్నాడు. రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీ యువరత్న.. టాలీవుడ్ లో బాలయ్యను యువరత్న గా పిలుస్తారు. బాలయ్యతో పునీత్ కి మంచి రిలేషన్ ఉంది.. అందుకే, ఆ టైటిల్ ని పెట్టుకున్నాడనే టాక్ ఉంది..

వరస విజయాలతో శాండల్ వుడ్ లో తిరుగులేని స్టార్డమ్ ని అందుకున్న పునీత్ రాజ్ కుమార్.. సడెన్ గా మరణించడం ఆ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు.. ఆయన మృతి.. ఒక్క శాండల్ వుడ్ నే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ ని కూడా షేక్ చేసింది..

పునీత్ రాజ్ కుమార్.. చెయిన్ స్మోకర్ అని చెబుతారు.. అదే ఆయన మృతికి కారణమా…? లేక ఇతర ఆర్ధిక పరమైన కెరీర్ పరమైన ఇబ్బందులు ఉన్నాయా..?.అనేది ఆసక్తికరంగా మారుతోంది.. పునీత్ రాజ్ కుమార్ మరణంతో దక్షిణాదిలోని టాప్ హీరోలంతా ఉలిక్కిపడ్డారు.. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు..

Post Comment