రవితేజ మరోటి మొదలుపెట్టాడు
Latest

రవితేజ మరోటి మొదలుపెట్టాడు

మాస్ మహరాజ్ రవితేజ మరో సినిమా అనౌన్స్ చేశాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో రవితేజ సినిమా అఫీషియల్ గానే ప్రకటించారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకున్నారు చాలామంది. బట్.. ఫైనల్ గా అనౌన్స్ అయింది. ఇది రవితేజకు 69వ సినిమా. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలు చేస్తున్నాడు. వీటిలో రామారావు చిత్రానికి ముందే త్రినాథరావు సినిమా రావాల్సి ఉంది. కానీ కథ విషయంలో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల అప్పుడు ఆగిపోయింది. దీంతో అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందనే మాటలు వినిపించాయి. ఈ మాటలను త్రినాథరావు ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తున్నా.. రూమర్స్ ఆగలేదు. దీంతో నిర్మాణ సంస్థలతో సహా ప్రకటించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం విశేషం. అతనికి ఇదే మొదటి పెద్ద హీరో సినిమా. మాస్ రాజాను ఓ డైనమిక్ రోల్ లో చూపించబోతున్నాడు త్రినాథరావు. మామూలుగా త్రినాథరావు సినిమాల్లో హీరోల ఎలివేషన్స్ బావుంటాయి. రవితేజ వంటి హీరోతో అంటే ఇంకా బావుంటుందేమో. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ కొత్త సినిమా ఈ నెల 4 నుంచే ప్రారంభం కాబోతోంది. ఏదేమైనా రవితేజ దూకుడు మామూలుగా లేదనుకోవచ్చు.

Post Comment