బాల‌య్య షో’లో ర‌వితేజ‌..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒకే ఫ్రేమ్ లోకి వ‌స్తే… మామూలుగా ఉండ‌దు. ఈ కాంబినేష‌న్ క్రేజే వేరు. అందుక‌నే ఈ కాంబినేష‌న్ ని సెట్ చేస్తుంది ఆహా. అవును.. ఆహా కోసం బాల‌య్య అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ టాక్ షోలో బాల‌య్య అద‌ర‌గొట్టేస్తున్నాడు. త‌న‌దైన స్టైల్ లో ప్ర‌శ్న‌లు అడుగుతూ.. ఎన‌ర్జిటిక్ గా ఈ పొగ్రామ్ ని న‌డిపిస్తూ.. విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య మోహ‌న్ బాబు, అనిల్ రావిపూడి, బ్ర‌హ్మానందం, మ‌హేష్ బాబుల‌తో ఈ షో చేశారు.

ఇప్పుడు బాల‌య్య షోలో మాస్ మ‌హారాజా రానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రవితేజతో బాలయ్య చిట్ చాట్ మామూలుగా వుండదు. ఖ‌చ్చితంగా ఆసక్తికరంగా వుంటుంది. పైగా సినిమా విడుదల కావడమో, లేదా కావాల్సి వుండడమో అయితే ఆ డిస్కషన్ వేరుగా వుంటుంది. అలా కాకుండా.. ఏమీ లేకుండా కాజువల్ గా కలిస్తే ఆ చిట్ చాట్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అందుక‌నే ర‌వితేజ‌తో స్పెష‌ల్ చిట్ చాట్ ప్లాన్ చేశార‌ని స‌మాచారం.

ఆర్ఆర్ఆర్ ద్వయం కీరవాణి, రాజమౌళిల‌తో స్పెష‌ల్ ఎపిసోడ్ వుందని ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్ ప్రొమోకు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఈ ఎపిసోడ్ త‌ర్వాత‌ రవితేజ ఎపిసోడ్ వుంటుంది. మ‌రి.. మాస్ రాజాని బాల‌య్య ఎలాంటి విష‌యాల గురించి అడుగుతాడో..? ఎలాంటి స‌మాచారాన్ని బ‌య‌ట‌కు తీస్తాడో చూడాలి.

Related Posts