రష్మిక మందన్నాకు మరో సినిమా పడింది..

వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు నితిన్. లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. ప్రయోగాలు చేసినా.. కథలు మార్చినా.. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చినా.. అతనికి హిట్ రావడం లేదు. మాచర్ల నియోజకవర్గం తర్వాత మొదలైన రెండు సినిమాలను మధ్యలోనే ఆపేశాడు. ఇక లేటెస్ట్ గా మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ఒకటి వక్కంతం వంశీతో చేస్తున్నాడు. మరోటి గతంలో తను ఇలాంటి ఫ్లాపుల దశలో ఉన్నప్పుడు హిట్ ఇచ్చిన దర్శకుడితో కమిట్ అయ్యాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ ను కూడా రిపీట్ చేస్తున్నారు. దీంతో కాంబినేషన్ కు ఓ కొత్త క్రేజ్ యాడ్ అయింది. మరి నితిన్ సినిమాలేంటో చూద్దాం.


వరుస విజయాలతో టాలీవుడ్ లోకి దూసుకువచ్చాడు నితిన్. అతని కటౌట్ కు పెద్ద హీరో అవుతాడు అనే భావించారు అప్పట్లో. బట్ ఆ టైమ్ లో ఉన్న మాస్ హీరో మానియా ట్రెండ్ లో పడి కొత్తగా వచ్చే ఇమేజ్ ను కాలదన్నుకున్నాడు. దీంతో అప్పట్లోనే ఏకంగా డజను ఫ్లాపులు వచ్చాయి. తర్వాత వచ్చిన ఇష్క్ మళ్లీ గాడిలో పెట్టింది. ఆ వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే కూడా హిట్ కావడంతో మనోడు లైన్ లో పడ్డాడు అనుకున్నారు. బట్ ఒక హిట్ వస్తే మూడు ఫ్లాపులు అన్నట్టుగా మారింది కెరీర్. 2021లో రంగ్ దేతో ఫ్లాప్ చూశాడు. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో చేసిన ఎక్స్ పర్మంటల్ మూవీ చెక్ అతని ఆశలకూ చెక్ పెట్టింది. హిందీ మూవీ అంధాదూన్ రీమేక్ గా వచ్చిన మేస్ట్రో ఓటిటిలో వచ్చినా మెప్పించలేకపోయింది.

అటుపై ఇక లవ్ స్టోరీస్ చేయను అంటూ 2022లో మాచర్ల నియోజకవర్గం మూవీతో అంచనాలు పెంచాడు. ఈ మూవీ ష్యూర్ షాట్ అనుకున్నారు చాలామంది. బట్.. అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో డైలమాలో పడిన నితిన్ అప్పటికే ఒప్పుకున్న రెండు సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నాడు. రైటర్ నుంచి దర్శకుడై అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే మూవీ చేసి ఫ్లాప్ అయిన వక్కంతం వంశీతో సినిమా స్టార్ట్ అయింది. రెండో సినిమా 2020లో తనకు భీష్మ మూవీతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కన్ఫార్మ్ అయింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా కూడా ఫైనల్ అయింది. భీష్మలో కూడా రష్మిక మందన్నానే హీరోయిన్. సో ఈ ముగ్గురూ కలిసి మరో హిట్ కు సిద్ధమయ్యారు అనుకోవచ్చు. మరి ఈ రెండు సినిమాలతో హిట్స్ అందుకోకపోతే నితిన్ కెరీర్ మరింత ప్రమాదంలో పడుతుందని చెప్పొచ్చు.

Related Posts