డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో రానా. టెన్షన్ లో టాలీవుడ్.?
Latest Movies Tollywood Trending News

డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో రానా. టెన్షన్ లో టాలీవుడ్.?

డ్రగ్స్ కేసు నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ని కుదిపేసింది. ఆతర్వాత డ్రగ్స్ కేసు విచారణ ఎదుర్కొన్న సినీ తారలను బాధితులుగా భావించి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటే.. ఇప్పుడు మళ్లీ డ్రగ్స్ కేసు తెర పైకి రావడం.. ఈ విచారణ సీరియస్ గా జరగడం చూస్తుంటే.. టాలీవుడ్ ప్రముఖులకు నిజంగానే డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందా.? తారల చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తుందా..? అనే టెన్షన్ మొదలయ్యింది. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులను విచారించారు.

ఇక ఇప్పుడు దగ్గుబాటి రానా వంతు వచ్చింది. నిన్న ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్ ఇంటిని సోదా చేయడం.. కొన్ని డాక్యుమెంట్లు, లాప్ టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కీలకమైన సమాచారం లభించిందని వార్తలు వచ్చాయి. అయితే.. రానా విచారణకు ముందు రోజు ఇలా జరగడంతో ఈరోజు రానాను వేటి గురించి ప్రశ్నించనున్నారు.? రానా ఏం చెప్పనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. ఈరోజు రానా లాప్ టాప్ తో ఈడీ కార్యాలయానికి వచ్చారు. విచారణలో రానా పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారని తెలుస్తుంది.

గతంలో డ్రగ్స్ కేసు గురించి రానా మాట్లాడుతూ.. తరుచూ పార్టీలకు వెళ్లడం వలన నాకు డ్రగ్స్ అలవాటు ఉంది అనుకుంటారు కానీ.. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. నేను ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని తెలిసి షాక్ అయ్యాను. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నరో వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కఠినంగా శిక్షించాలి అన్నారు. ఇప్పుడు రానానే డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇంకా రవితేజ, నవదీప్ తదితరులను విచారించాల్సివుంది. దీంతో ఈడీ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ఎవర్నైనా అరెస్ట్ చేస్తారా..? లేక గతంలో వలే క్లిన్ చిట్ ఇస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.

Post Comment