Advertisement
రానా 1945 – రివ్యూ
Latest Reviews Tollywood

రానా 1945 – రివ్యూ

Advertisement

రానా దగ్గుబాటి, రెజీనా జంట‌గా న‌టించిన చిత్రం 1945. ఇందులో సత్యరాజ్, నాజర్, కాలి వెంకట్, సప్తగిరి ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని స‌త్య‌శివ తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ కె.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌డంతో జ‌న‌వ‌రి 7న అన‌గా ఈ రోజు 1945 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. 1945 చిత్రంతో రానా ఆక‌ట్టుకున్నాడా..? లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

క‌థ

నేతాజి సుభాష్ చంద్రబోస్ 1945లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించారు. ఆ సమయంలో తన కుటుంబ వ్యాపారాలను చూసుకొనేందుకు ఆది (రానా ద‌గ్గుబాటి) బర్మాకు వ‌స్తాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో పని చేసే తహసీల్దార్‌ (నాజర్)‌ కూతురు (రెజీనా)తో ఆదికి నిశ్చితార్థం జరుగుతుంది. అయితే.. స్వాతంత్ర్య యుద్ధానికి వేరేగా జీవ‌నం సాగించే ఆది భార‌త సైన్యంలోకి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎందుకు భార‌త సైన్యంలో చేరాలి అనుకున్నాడు..? బ‌ల‌మైన బ్రిటీష్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు.? చివ‌రికి యుద్ధం ఏమైంది..? అనేదే మిగిలిన‌ క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

రానా, రెజీనా ప‌ర్ ఫార్మెన్స్
క‌థ‌లో ట్విస్టులు
మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

క‌థ పై స‌రైన క‌స‌ర‌త్తు చేయ‌క‌పోవ‌డం
క్వాలిటీ స‌రిగా లేక‌పోవ‌డం..

విశ్లేష‌ణ

ఆది పాత్ర‌లో రానా దగ్గుబాటి ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. ఇక క‌థానాయిక రెజీనా అందం, అభిన‌యం చూపిస్తూ ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. మిగితా క్యారెక్టర్లలో రానా (ఆది) స్నేహితుడిగా సప్తగిరి నటించాడు. తనదైన కామెడీతో అక్కడక్కడా న‌వ్వించేందుకు ట్రై చేశాడు. ఇక నాజర్ మంచి పాత్రలో నటించాడు. సినిమాకు బలంగా మారే పాత్రలో ఆకట్టుకొన్నాడు. సత్యరాజ్ కూడా తన పాత్రలో జీవించాడు.

యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాలను రీరికార్డింగ్ ఎమోషనల్‌గా మార్చిందని చెప్పవచ్చు. సత్య పన్మార్ సినిమాటోగ్రఫి, గోపికృష్ణ అందించిన ఎడిటింగ్ బాగుంది. ఆకుల శివ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ద‌ర్శ‌కుడు తీసుకున్న క‌థ పై ఇంకాస్త క‌స‌ర‌త్తు చేయ‌క‌పోవ‌డం పెద్ద మైన‌స్. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సినిమా చాలా రోజులు ఆగిపోయింది. బ‌డ్జెట్ ప‌రంగా ఇబ్బందులు రావ‌డంతో ప‌క్క‌న‌పెట్టేశారు.

ఆత‌ర్వాత ఎలాగైనా స‌రే.. కంప్లీట్ చేయాల‌నే ఉద్దేశ్యంతో క్వాలిటీ గురించి ప‌ట్టించుకోకుండా తీసేశారు. అది తెర పై స్ప‌ష్టంగా క‌నిపించింది. సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఏదో మిస్ అయ్యింది. ఎందుకు ఈ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంటుంది. రానాని తెర పై చూడాల‌నుకుంటే.. టైమ్ వేస్ట్ చేసుకోవాలి అనుకుంటే.. 1945 చూడ‌చ్చు.

రేటింగ్ 2/5

Advertisement

Post Comment