రామ్ చరణ్ కు వారసుడు వస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక వార్త మెగా ఫ్యాన్స్ అందరిలోనూ గొప్ప ఆనందాన్ని తెచ్చింది. పెళ్లై ఇన్నేళ్లవుతోన్నా.. తనకంటే వెనకే పెళ్లి చేసుకున్న వాళ్లంతా పేరెంట్స్ అవుతున్నా.. రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ విషయంలో వెనకబడి ఉన్నారు. దీంతో పిల్లలు కనే విషయంలో ఉపాసనపై కొంతమంది కమెంట్స్ కూడా చేశారు.

తను మాత్రం కరెక్ట్ టైమ్ లో ప్లాన్ చేసుకుంటాం అని చెబుతూ వచ్చింది. ప్లాన్ చేసుకోవడానికి అదేమైనా టూరా లేక బిజినెసా అనే కమెంట్స్ కూడా వచ్చాయి అప్పట్లో. బట్ ఫైనల్ గా వీరు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారని.. చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అంటే వీరు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారన్నమాట. హనుమంతుడి ఆశిస్సులతో తల్లిదండ్రులు కాబోతోన్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు మీ అందరి ఆశీర్వాదం కావాలని చిరంజీవి పోస్ట్ చేశాడు. మొత్తంగా మెగాస్టార్ వారసుడికి వారసుడు రాబోతున్నాడన్నమాట. మరి చరణ్ – ఉపాసనలకు మనమూ కంగ్రాట్యులేషన్స్ చెప్పేద్దాం.

Related Posts