Ram charan : అఖిల్ కోసం చరణ్ ‘భాగస్వామ్య’ సాయం

స్టార్ హీరోలు అంటే స్టార్ హీరోలే. తమ తోటి హీరోలను లేపడానికి వాళ్లే స్వయంగా రంగంలోకి దిగుతారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ కోసం రామ్ చరణ్‌ లాగా. రామ్ చరణ్‌ రీసెంట్ గా ఓ కొత్త బ్యానర్ స్టార్ట్ చేశాడు.

ఆల్రెడీ ఆయనకు కొణెదల పేరుతోఓ ప్రొడక్షన హౌస్ ఉంది. ఈ బ్యానర్ లోనే చిరంజీవితో సినిమాలు చేస్తున్నాడు. అయినా నిన్నటి వరకూ యూవీ క్రియేషన్స్ లో భాగస్వామిగా ఉన్న తన మిత్రుడు విక్రమ్ తో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేశాడు. మరి ఫ్యామిలీ బ్యానర్ సంగతేంటీ అనుకోవడానికి లేదు. అదీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆ బ్యానర్ చరణ్‌ తల్లి సురేఖ పేరు మీద ఉంది.


ఇక ఈ కొత్త బ్యానర్ నుంచి ఫస్ట్ మూవీని అఖిల్ తో తీయబోతున్నాడు చరణ్‌. ఇందుకోసం భారీ బడ్జెట్ తో రంగం సిద్ధమైంది. ఇంతకు ముందు యూవీ బ్యానర్ సినిమాలకు పనిచేసిన అనిల్ అనే వ్యక్తిని ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయ చేయబోతున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోన్న ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.


ఇక చరణ్‌ కు అఖిల్ అంటే కాస్త ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే కుర్రాడిని ఎలాగైనా నిలబెట్టాలనే బాధ్యత తీసుకున్నాడు అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ కోసం కూడా చరణ్‌ ధృవలా ప్రమోషన్స్ చేశాడు. బట్ ఆ మూవీ వర్కవుట్ కాలేదు. ఆ మాటకొస్తే అసలు అఖిల్ కు ఇప్పటి వరకూ సరైన హిట్టే పడలేదు. మరి చరణ్‌ ఎంట్రీతో అయినా అఖిల్ ఫేట్ మారుతుందేమో చూడాలి. ఏదేమైనా అఖిల్ కోసం చరణ్‌ ముందుకు రావడం మాత్రం ఈ రెండు కుటుంబాల హీరోల ఫ్యాన్స్ లో కొంత ఆశ్చర్యాన్ని.. కొంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

Related Posts