ఏప్రిల్ నుంచే రాజమౌళి – మహేష్‌ మూవీ

రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తోంది. బాహుబలికి ముందు అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఇంత క్రేజ్ లేదు. కానీ కల్పిత కథను భారత స్వాతంత్ర్య సంగ్రామంగా మార్చి.. పూర్తి అబద్ధాన్ని ఫిక్షనల్ స్టోరీ అనే ముసుగులో దేశానికి చూపించిన ఆర్ఆర్ఆర్ తో అతనికి వాల్డ్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ఏకంగా ఆస్కార్ వరకూ వెళ్లింది. ఆస్కార్ వస్తుందా రాదా అనేది పక్కన బెడితే అతని నెక్ట్స్ మూవీ గురించిన ఇష్యూస్ అప్పుడే హాట్ టాపిక్ గా మారాయి. మరి అతని తర్వాతి సినిమా మహేష్‌ బాబుతోనే అని తెలుసు కదా..? సో ఈ మూవీ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతోందో తెలుసా..?


తెలుగులో రాజమౌళి ఇప్పటి వరకూ చాలామంది టాప్ హీరోలతో పనిచేశాడు. మరికొందరు టాప్ హీరోలను గ్లోబల్ స్టార్స్ గా మార్చాడు. జక్కన్న కంటే ముందు వరకూ వీళ్లు కేవలం టాలీవుడ్ టాప్ హీరోలు మాత్రమే. అదీ ఆయన రేంజ్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కోసం ఆస్కార్ వస్తుందని నమ్మకంతో అమెరికాలోనే ఉన్నాడు. మార్చి నెల రెండో వారంతో ఆ తంతు కూడా ముగిసిపోతుంది. మరవైపు ఇప్పటికే అతను మహేష్‌ బాబుతో చేయబోతోన్న కథను లాక్ చేసి ఉంచాడు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను పూర్తి చేసి ఉన్నాడు. రాజమౌళి వచ్చిన తర్వాత ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్‌ చేయబోతున్నాడు. అయితే ఈ వర్క్స్ కోసం రాజమౌలి మరీ ఎక్కువ టైమ్ తీసుకోవడం లేదు.

ఈ ఏప్రిల్ నెల నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.ఈ చిత్రం ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. మరి ఏప్రిల్ లో రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఖచ్చితంగా మూడు నెలల్లోనే షూటింగ్ కు సిద్ధం అవుతాడు. అలా చూస్తే మహేష్‌ బాబు కూడా ఎక్కువ టైమ్ లేకుండా ఈ యేడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచే రాజమౌళి మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. పైగా ఈ మూవీకి ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉండవు అని చెబుతున్నారు.

అంటే కేవలం గ్రాండ్ గా కనిపించే లొకేషన్స్ కు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అలా చూస్తే వర్కింగ్ డేస్ కూడా తక్కువగానే ఉంటాయి. అయితే తీసేది రాజమౌళి కాబట్టి.. మరీ తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తాడు అనుకోలేం. ప్రస్తుతానికి ఈ మూవీ కథగా వినిపిస్తున్నది ఏంటంటే.. మహేష్‌ బాబు ఓ ఇండియన్ స్పై గా అమెజాన్ అడవుల్లో ఓ అరుదైన విషయాన్ని కనిపెట్టి భారత్ కు తీసుకువచ్చే హీరో పాత్రలో కనిపించబోతున్నాడు అంటున్నారు. ఇది ఓ రకంగా ఇండియన్ జేమ్స్ బాండ్ తరహాలో సాగే మూవీ అని కూడా అంటున్నారు. సో.. మొత్తంగా రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాకు మరీ ఎక్కువ టైమ్ లేదు. ఈ ఏప్రిల్ నుంచే మొదలవుతుందని చెప్పొచ్చు.

Related Posts