పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలపై ‘ఆర్’వేవ్ ఎఫెక్ట్
Bollywood Latest Movies Regional Tollywood

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలపై ‘ఆర్’వేవ్ ఎఫెక్ట్

కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో కన్ఫ్యూజన్స్ పెరిగాయి. హడావిడీగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం.. ఆ తర్వాత వాటిని మార్చుకోవడం. మొదటి సారి డేట్స్ మారినప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. అయితే సంక్రాంతికి సరైన డేట్స్ ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్న స్టార్స్ మరోసారి తమ చిత్రాలను వాయిదా వేయబోతున్నారనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. మరి అప్పుడంటే సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడేమైందీ అంటారా.. ఇప్పుడు ఆర్ వేవ్ వస్తోందట. ఆర్ వేవ్ అంటే ఏంటీ అనుకుంటున్నారు కదూ..? జస్ట్ వాచ్ దిస్.
సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి పెద్ద స్టార్స్ అంతా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి మరీ షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో అవి మారుతున్నాయనే టాక్ లేదా రూమర్ వస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదో ఒక సినిమా డేట్ మారిందంటే అనుకోవచ్చు. కానీ ఏకంగా మూడు నాలుగు సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయంటే విశేషమే కదా. ప్రస్తుతం వీళ్లు పోస్ట్ పోన్ అవుతున్నారని ఖచ్చితంగా చెప్పలేదు కానీ.. అవుతాయనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. పోస్ట్ పోన్ అవుతున్న చిత్రాల జాబితాలో ఆల్రెడీ ఎఫ్3 డేట్ అనౌన్స్ చేసింది. మామూలుగా వీళ్లు గతంలో లాగా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాం అని చెప్పారు. అన్నట్టుగానే జనవరి 15న వస్తున్నారు అనుకున్నారు. బట్.. ఆ టైమ్ కు ఉన్న పోటీ వల్లో లేక షూటింగ్ లేట్ అవుతుందో కానీ.. కొత్తగా మార్చి 25న వస్తున్నట్టు ప్రకటించారు. సో.. సంక్రాంతికి రావడం లేదని ఖచ్చితంగా చెప్పేశారన్నమాట.

ఇక పోస్ట్ పోన్ అవుతున్నాయని రూమర్ గా వినిపిస్తోన్న చిత్రాల్లో భీమ్లా నాయక్ కూడా ఉండటం ఆశ్చర్యం. ఇప్పటికే షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. పైగా ఎక్కువ లొకేషన్స్, డ్యూయొట్స్ కూడా లేని చిత్రం ఇది. అందుకే వేగంగానే పూర్తి చేస్తున్నారు. అందుకే మొదటి నుంచీ వీళ్లు జనవరి 12న వస్తున్నాం అని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. అయినా భీమ్లా నాయక్ ను జనవరి 26 లేదా సమ్మర్ లో విడుదల చేస్తారు అనే గాసిప్స్ వస్తున్నాయి. మరి ప్రొజెక్టర్ లేకుండా బొమ్మరాదు కదా..?

జనవరి 13న వస్తుందని చెప్పిన మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనే వార్తలూ వస్తున్నాయి. నిజానికి సర్కారువారి పాట కూడా వేగంగానే చిత్రీకరణ జరుపుకుంటోంది. అయినా ఇంత పెద్ద సినిమాపైనా రూమర్స్ వస్తున్నాయంటే అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతోంది అనే డౌట్స్ అందర్లోనూ వస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్ని బట్టి సర్కారువారి పాటను సమ్మర్ బరిలో ఉగాదికి విడుదల చేస్తారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రాల మధ్య  రాధేశ్యామ్ మాత్రం చెప్పిన టైమ్ కే వస్తుందనేది ఖచ్చితంగా వినిపిస్తున్న వార్త. వీళ్లు మొదటే జనవరి 14ను లాక్ చేసుకున్నారు. జనవరి 12న వస్తుందన్న భీమ్లా నాయక్, 13న వస్తుందన్న సర్కారువారి పాటపై రూమర్స్ వస్తున్నాయి. కానీ రాధేశ్యామ్ విషయంలో వినిపించడం లేదు. సో.. సంక్రాంతిని డార్లింగ్ ఒక్కడే ఏలబోతున్నాడా.?

సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య కలయికలో వస్తోన్న బంగార్రాజు కూడా వస్తుందని చెప్పారు. వీళ్లు జనవరి 15ను ఫిక్స్ చేసుకున్నారనే టాక్ ఉంది. అయితే ఈ చిత్రం గురించి ఇంకా ఏ న్యూసూ రావడం లేదు. అయితే ఇంత పెద్ద సినిమాలు ఎందుకు వెనక్కి వెళుతున్నాయి అంటే.. ముందే చెప్పినట్టు ఆర్ వేవ్ వస్తుందనేదే అసలు రీజన్ అంటున్నారు. ఆర్ వేవ్ అంటే ఆర్ఆర్ఆర్ మూవీ. యస్ రాజమౌళి రిక్వెస్ట్ వల్లే ఈ చిత్రాలన్నీ పోస్ట్ పోన్ చేసుకునేందుకు ముందుకు వచ్చాయనేది కొత్త వార్త.

ఎన్టీఆర్, చరణ్ కాంబోలో రాజమౌళి రూపొందించిన ఈ భారీ చిత్రం దసరాకే వస్తుందన్నా.. అప్పుడు బాక్సాఫీస్ ఉన్న సిట్యుయేషన్ వల్ల వదిలేశారు. కొత్త డేట్ గా జనవరి 7ను ప్రకటించారు. కేవలం ఒక వారంతో ఆర్ఆర్ఆర్ హవా తగ్గుతుందనుకోలేం. ఒకవేళ ఉన్నా.. సంక్రాంతి టైమ్ కు ఉన్న చిత్రాల వల్ల ఈ మూవీపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నిర్మాతలు కూడా మాట్లాడుకుని.. ఆర్ఆర్ఆర్ కు సంక్రాంతి వరకూ దారి ఇస్తూ.. ఈ చిత్రాలు కొత్తదారులు చూసుకుంటున్నాయనేది లేటెస్ట్ న్యూస్. మరి ఈ వాయిదాల్లో నిజమెంత.. దానికి ఆర్ వేవ్ కారణం ఎంత అనేది వాళ్లే చెబితే బావుంటుందేమో.

Post Comment