పుష్పది ఫస్ట్ డే రికార్డ్ కాదు..

పుష్ప ది రైజ్.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా నార్త్ లో పుష్పరాజ్ హవా ఇప్పటికీ స్ట్రాంగ్ గానే కనిపిస్తుండటం విశేషం. లేటెస్ట్ గా అక్కడ ఈ మూవీ ఓ కొత్త రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది. ఏ సినిమా అయినా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తే.. దాన్ని మరో మూవీ అధిగమిస్తుంది. కానీ ఈ మూవీ విషయంలో కాస్త కొత్తగా ఉంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ అన్ని చోట్లా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇది కూడా ఊహించిందే అయినా.. హిందీలో మాత్రం పుష్పరాజ్ హవా ఓ రేంజ్ లో కనిపిస్తోంది. ఈ మూవీ తర్వాత విడుదలైన 83 మూవీని అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. అలాగే స్పైడర్ మేన్ సైతం హిందీలో పుష్పరాజ్ ను ఇబ్బంది పెట్టలేకపోయాడు. కలెక్షన్స్ పరంగా తెలుగు హీరోలు కూడా కుళ్లకునేలా ఇప్పటి వరకూ ఈ మూవీ అక్కడ 60కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం.
పుష్ప ఫస్ట్ వీక్ విడుదలైనప్పుడు కేవలం మూడు రోజుల్లోనే అక్కడ 12.68కోట్లు కలెక్ట్ చేసింది. విశేషం ఇప్పటికి మూడో వారం నడుస్తుండగా ఈ వీకెండ్ లో ఏకంగా 15.85కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ వీకెండ్ కంటే థర్డ్ వీకెండ్ కలెక్షన్స్ భారీగా ఉన్నాయన్నమాట. ఎంత మాస్ మూవీ అయినా ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయడం విశేషమే. పుష్పరాజ్ లో హిందీ ప్రేక్షకులకు అంత బాగా నచ్చిన అంశాలేంటో కానీ.. మూవీ మాత్రం కలెక్షన్స్ తో అక్కడి బయ్యర్స్ కు పండగ తెచ్చేసింది. అంటే ఇక వచ్చే పార్ట్ హిందీలో ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనుకోవచ్చు.

Related Posts