‘పుష్ప‌’, ‘ఆర్ఆర్ఆర్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేయ‌డానికి కార‌ణం ఇదే
Latest Movies Tollywood

‘పుష్ప‌’, ‘ఆర్ఆర్ఆర్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేయ‌డానికి కార‌ణం ఇదే

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌. డిసెంబ‌ర్ 17న పుష్ప చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మ‌రో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేయ‌డానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను దుబాయ్ లో చాలా గ్రాండ్ గా చేయాలి అనుకున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ అటెన్ష‌న్ కోసం అక్క‌డ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేయాలి అని ప్లాన్ చేశాయి.

అయితే.. ఇప్పుడు ఆ ప్లాన్ విర‌మించుకున్నాయ‌ని స‌మాచారం. కార‌ణం ఏంటంటే.. పుష్ప విష‌యానికి వ‌స్తే.. ఇంకా రిలీజ్ టైమ్ 22 రోజులు మాత్ర‌మే ఉంది. ఇంకా షూటింగ్ జ‌రుగుతోంది. మ‌రో వైపు మ‌రో యూనిట్ తో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేయిస్తున్నారు సుకుమార్. రోజుకు 24 గంట‌లు వ‌ర్క్ చేసినా.. టైమ్ స‌రిపోను ప‌రిస్థితి. ఇలాంటి టైమ్ లో క్రూ మొత్తాన్ని దుబాయ్ తీసుకెళ్లి ఈవెంట్ చేసే ప‌రిస్థితి లేదు. అందుచేత ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఈవెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇక ఆర్ఆర్ఆర్ టీమ్ ది కూడా ఇదే ప‌రిస్థితి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ఇంకా 43 రోజులు టైమ్ ఉంది. టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. పాట‌లు రిలీజ్ చేశారు కానీ.. ఇంకా ట్రైల‌ర్ రిలీజ్, స్పెష‌ల్ ఇంట‌ర్ వ్యూలు ఇలా ప‌బ్లిసిటీ పొగ్రామ్ లు చాలా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో దుబాయ్ టీమ్ అంద‌రినీ తీసుకెళ్ల‌డం అంటే చాలా పెద్ద ప‌ని. పైగా అంద‌రి డేటులు దొర‌కాలి. ఇదంతా త‌ల‌కు మించిన భారం అవుతుంది. అందుక‌నే.. హైద‌రాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబాయి న‌గ‌రాల్లో ఈవెంట్లు చేస్తే దాని క‌న్నా ఎక్కువ ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నే ఉద్దేశ్యంతో.. దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ ను జ‌క్క‌న్న మార్చుకున్నాడ‌ని స‌మాచారం.

Post Comment