పూరి డేరింగ్ స్టెప్. రొమాంటిక్ పక్కా హిట్
Latest Movies Tollywood

పూరి డేరింగ్ స్టెప్. రొమాంటిక్ పక్కా హిట్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించిన చిత్రం రొమాంటిక్. ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాను రెండు రోజుల ముందే సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు చూపించాలనుకుంటున్నారట పూరి జగన్నాథ్. ఇది ఒక రకంగా డేరింగ్ స్టెప్. ఎందుకంటే.. ఈరోజుల్లో రిలీజ్ డే టాక్ ను బట్టే ఓపెనింగ్స్ వస్తున్నాయి. టాక్ ఏమాత్రం బాగోలేకపోతే.. ఇక ఓపెనింగ్స్ సంగతి అంతే.

ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల ముందే రొమాంటిక్ సినిమాను చూపించడం అంటే.. మామూలు విషయం కాదు. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటేనే అలా చేస్తారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పూరి రొమాంటిక్ మీద ఎంత నమ్మకంగా ఉన్నారో. అయితే.. ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ ఇలా చేయడం పెద్ద రిస్క్. ఏమాత్రం తేడా జరిగినా మీడియాలో సరిగా రివ్యూలు రాకపోయినా జనాలు థియేటర్లకు రారు. ఈ విషయం తెలిసినా పూరి ఈ నిర్ణయం తీసుకున్నారంటే.. ఆయన గట్స్ మెచ్చుకోవాల్సిందే. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ను బట్టి ఆకాష్ పూరి ఫస్ట్ సక్సస్ అంటున్నారు. మరి.. ఏ రేంజ్ సక్సస్ సాధిస్తుందో చూడాలి.

Post Comment