కొన్నిసార్లు సినిమాల్లో చేసే పాత్రలు రియల్ లైఫ్ లో ఇన్స్ స్పైర్ చేస్తాయి. అందుకే సినిమాల్లో పొలిటీషియన్స్ గా నటించిన వాళ్లు తర్వాత నిజం రాజకీయాల్లోకీ వచ్చారు. వస్తున్నారు. అలా ఇప్పుడు ప్రియమణి కూడా పొలిటికల్ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. మరి తనకు ఈ కోరిక కలకగడానికి కారణం ఏంటీ అంటే కస్టడీ మూవీ అంటున్నారు. ఈ మూవీలో తను దాక్షాయణి అనే సిఎమ్ పాత్రలో నటించింది.
ఎంత సినిమా అయినా అందులోనూ సిఎమ్ అంటే ఎంత హడావిడీ ఉంటుందో అంతా చూపిస్తారు కదా..? ఆ హడావిడీ చూసి పడిపోయిందో ఏమో.. తను కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది అంటున్నారు.
సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి.. తమదైన శైలిలో హవా చేశారు. బట్ఇది అందరికీ సాధ్యం కాలేదు. కొద్దిమంది మాత్రమే రాణించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు. అంతకు ముందు జయలలిత ఏకంగా ముఖ్యమంత్రిగానే చేశారు.
బట్ తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ మాజీ హీరోయిన్ కూడా రాజకీయాల్లో జెండా ఎగరేశారు అని చెప్పలేం. అయినా ప్రియమణి తెలుగు నుంచి కాకుండా తమిళనాడు లేదా కేరళ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఈ రీల్ సిఎమ్ రియల్ సిఎమ్ అవుతుందా అనేది చెప్పలేం కానీ.. ఖచ్చితంగా నేటి రాజకీయాలు వీళ్లు భావించేంత సులువైతే కాదు.