Prashanth neel : ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పని ప్రశాంత్ నీల్ .. కారణం?

ఏ ఇండస్ట్రీలో అయినా ఓ టాప్ హీరో బర్త్ డే అంటే తెలిసిన వారు తెలియని వారు అంతా బర్త్ డే విషెస్ చెబుతారు. ఇంక కొంచెం పరిచయం ఉన్నవాళ్లైతే చెప్పేదేముందీ.. వారి ఫోటోస్ పెట్టి మరీ విషెస్ చెబుతారు. అయితే లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ ను ట్రాన్స్ ఫార్మర్ తో పోలుస్తూ విషెస్ చెప్పిన ప్రశాంత్ నీల్ ఈ సారి చెప్పలేదు. అందుకు కారణమేంటో తెలుసా..? ప్రభాస్ ఫ్యాన్స్. యస్ వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా ఇదే నిజం. ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశాంత్ నీల్ .. తన నెక్ట్స్ హీరో అయిన ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ కూడా చెప్పలేకపోయాడు. మరి అసలేం జరిగిందో చూద్దాం.


ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన పార్ట్ లో చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. ఇక సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అని ముందు నుంచీ చెబుతున్నారు. మధ్యలో పోస్ట్ పోన్ అయిందనే రూమర్స్ వస్తే వెంటనే ఖండించారు కూడా. అయితే రిలీజ్ డేట్ తప్ప ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ కనిపించడం లేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పట్లానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ను సోషల్ మీడియాల్లో ట్యాగ్ చేస్తూ అదే పనిగా విసిగిస్తున్నారట. కొందరైతే చెప్పరాని బూతులు కూడా తిడుతున్నారట. మరీ గొప్పగా కాకపోయినా ప్రశాంత్ కు తెలుగు బాగానే వచ్చు కాబట్టి అన్నీ అర్థం అవుతున్నాయి. రిలీజ్ కు చాలా టైమ్ ఉంది కాబట్టి వీళ్లు కామ్ గా వాళ్ల పని చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం కొత్త అప్డేట్ కోసం బూతులతో ప్రశాంత్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో కొన్నాళ్లు భరించిన ప్రశాంత్.. ఏకంగా ట్విట్టర్ నుంచే ఎగ్జిట్ అయిపోయాడు.

ఆ కారణంగా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ ను పబ్లిక్ గా చెప్పడం కుదరలేదు. అఫ్‌ కోర్స్ పర్సనల్ గా ఫోన్ చేసో.. లేక మెసేజ్ ద్వారానో విషెస్ చెప్పే ఉంటాడు. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ విసిగించడం వల్ల ట్విట్టర్ నుంచి తొలిగిపోయాడు అనేది నిజం.

Related Posts