సినిమా వాళ్లు అనగానే అంత లగ్జరియస్ లైఫ్‌ నే చూస్తారు కానీ.. వారి ఎమోషన్స్ ను కూడా దాచుకుని ఎందరినో ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడతారో అర్థం చేసుకోరు. మరోవైపు తమ వల్ల షూటింగ్ ఆలస్యం అయితే నిర్మాత లాస్ అవుతాడు. అలాగే ఇతర ఆర్టిస్ట్ ల డేట్స్ కూడా మారిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డార్లింగ్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. పెదనాన్న కృష్ణంరాజు మరణించిన 11 రోజుల తర్వాత షూట్ లో పార్టిసిపేట్ చేశాడట. మరి ఇంత త్వరగా సెట్స్ లో అడుగుపెట్టడానికి కారణం ఏంటో తెలుసా..?ప్రభాస్ క్యారెక్టర్ గురించిఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అందరినీ అతను డార్లింగ్ అని పిలుస్తాడు కానీ.. అసలైన డార్లింగ్ అంటే అతనే అంటారు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు.

బాలీవుడ్ లో చేసిన ఆదిపురుష్‌ పూర్తయింది. ప్రస్తుతం పోష్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మరోవైపు ప్రాజెక్ట్ కే తో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాడీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న సినిమా కూడా లైన్ లో ఉంది. ప్రస్తుతం సలార్ కోసమే ప్రభాస్ మళ్లీ సెట్స్ లో అడుగపెట్టాడు. నిజానికి ఇంట్లో జరిగిన విషాదం నుంచి ప్రభాస్ అంత ఈజీగా కోలుకోడు అనే భావించారు అంతా. కానీ అతను మాత్రం నిర్మాత కోసం బాధను దిగమింగి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

సలార్ కోసం కొన్నాళ్ల క్రితమే చాలా సెట్స్ వేశారట. ఈ సెట్స్ లో ఒక్కోదాంట్లో ఐదారు రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. తీరా షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుండగానే కృష్ణంరాజు మరణించారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. కానీ దానికి అయ్యే రెంట్ నిర్మాతను ఇబ్బంది పెడుతుంది. అందుకే 11 రోజుల కార్యక్రమం అవగానే వెంటనే షూటింగ్ లో జాయిన్ అయ్యాడంటున్నారు. ఈ పార్ట్ తో సలార్ కు సంబంధించి మేజర్ షూట్ అయిపోతుందంటున్నారు. అలాగే ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ తో పాటు ఇతర మేజర్ క్రూ కూడా ఉన్నారట. ప్రభాస్ వెంటనే షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇదీ ఓ కారణం. ఇక వచ్చే నెల నుంచి ప్రాజెక్ట్ కే షూట్ లోనూ పార్టిసిపేట్ చేస్తాడు. మొత్తంగా విషాదాన్ని దాటుకుని వినోదాన్ని పంచేందుకు ముందుకు రావడం అంటే చిన్న విషయమేం కాదు.