పవన్ కళ్యాణ్, మహేష్‌ బాబును టెన్షన్ పెడుతున్న ప్రభాస్
Latest Movies Tollywood

పవన్ కళ్యాణ్, మహేష్‌ బాబును టెన్షన్ పెడుతున్న ప్రభాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – మాటలు సంభాషణలు అందిస్తుండడం విశేషం. పవన్ – రానాల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది.

ఇక సూపర్ స్టార్ మహేష్‌ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్‌ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ నటిస్తుంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే.. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే.. అందరి కంటే ముందుగా సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించింది మహేష్ బాబే. ఆతర్వాత పవన్ కళ్యాణ్ సంక్రాంతికి రానున్నట్టుగా అనౌన్స్ చేశారు.

దీంతో ఈసారి సంక్రాంతి బరిలో మహేష్‌, పవన్ పోటీపడుతుండడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నేనున్నాను అంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాను జులై 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ.. కరోనా కారణంగా కుదరలేదు. దసరాకి రాధేశ్యామ్ వస్తుందని వార్తలు వచ్చాయి కానీ.. దసరాకి కూడా రావడం లేదట. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి రాధేశ్యామ్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. దీంతో 2022 సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది. మరి.. సంక్రాంతి విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Post Comment