బాహుబలితో వచ్చిన ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళుతున్నాడు ప్రభాస్. మధ్యలో సాహో, రాధేశ్యామ్ పోయినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడుగా వెళుతున్నాడు. ఈ యేడాది రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. జూన్ లో చివర్లో ఆదిపురుష్‌ త్రీడీలో విడుదల కాబోతోంది.

సెప్టెంబర్ 28న మోస్ట్ అవెయిటెమ్ మూవీగా చెప్పుకుంటోన్న సలార్ వస్తోంది. సలార్ కు ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయీ సినిమాపై. సలార్ లో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్, మళయాల సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కెజీఎఫ్ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు ఏ హడావిడీ లేకుండా మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ కూడా జరుగుతోంది.

ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతుండటం విశేషం. రాజా డీలక్స్ ఈ యేడాదే పూర్తవుతుంది. ప్రాజెక్ట్ కే కూడా ఈ ఇయర్ చివరి వరకూ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే యేడాది సమ్మర్ రిలీజ్ గా వస్తుంది. అయితే లేటెస్ట్ గా డార్లింగ్ మరో భారీ సినిమాకు ఓకే చెప్పాడు.


బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కు కేరాఫ్ గా నిలిచిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడు. రీసెంట్ గానే ఈ కాంబినేషన్ గురించిన వార్తలు వచ్చాయి. అప్పుడు రూమర్స్ అనుకున్నారు కానీ.. లేటెస్ట్ గా కన్ఫార్మ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను మల్టీస్టారర్ అని కూడా చెబుతున్నారు.


ఇక సిద్ధార్థ్ ఆనంద్ ఇంతకు ముందు బ్యాంగ్ బ్యాంగ్, అంజానా అంజానీ, వార్ వంటి భారీ యాక్షన్ ఎంటర్టైన్స్ తో ఆకట్టుకున్నాడు. అతని డైరెక్షన్ లోనే రూపొందిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణ్‌ మూవీ పఠాన్ ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ మూవీకి సంబంధించిన హడావిడీ తగ్గిన తర్వాత అతను ప్రభాస్ ప్రాజెక్ట్ పై కాన్ సెంట్రేట్ చేస్తాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను ఈ నెలాఖరు వరకూ తెలియజేస్తారంటున్నారు. మొత్తంగా ప్రభాస్ దూకుడు చూస్తోంటే అతను గ్లోబల్ స్టార్ ట్యాగ్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది కదూ..?

,