ఇండియాలోనే నెంబ‌ర్ 1 హీరో ప్ర‌భాస్
Latest Movies Tollywood

ఇండియాలోనే నెంబ‌ర్ 1 హీరో ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించ‌డంతో ప్ర‌భాస్ పేరు దేశ‌విదేశాల్లో మారుమ్రోగింది. ప్ర‌భాస్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్స్ సైతం క్యూక‌ట్టారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం సాహో. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. ఇంకా చెప్పాలంటే.. సౌత్ లో కంటే నార్త్ లోనే సాహో సినిమాకు భారీ వ‌సూలు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు నార్త్ లో ప్ర‌భాస్ కి ఎంత క్రేజ్ ఉందో. అందుక‌నే ప్ర‌భాస్ పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తున్నాడు.

ఇప్పటి వరకూ బాలీవుడ్ లో మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ కలిగి ఉన్న స్టార్స్ సైతం ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి షాక్ అవుతున్నారు. ప్రభాస్ కు ఉన్నక్రేజ్ ను బ‌ట్టి తను చేసే ప్రతి ఒక్క సినిమా కు కూడా 100 కోట్ల రూపాయలకి పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన‌ సందీప్ రెడ్డి వంగాతో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇది ప్ర‌భాస్ 25వ చిత్రం. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

ప్రభాస్ న‌టించిన పాన్ ఇడియా మూవీ రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఆత‌ర్వాత ఆదిపురుష్, ఆత‌ర్వాత స‌లార్ రిలీజ్ కానున్నాయి. నాగ్ అశ్విన్ తో పాన్ వ‌ర‌ల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత 25వ చిత్రం సందీప్ రెడ్డితో చేస్తున్నారు. ఈ విధంగా వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. 100 కోట్ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న ప్ర‌భాస్ ఇండియాలోనే నెంబ‌ర్ 1 హీరో. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం.

Post Comment