కామెడీ సినిమాలో ప్రభాస్

డార్లింగ్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇండియాస్ టాప్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అలాంటి ప్రభాస్ కామెడీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది..? అంటే అభిమానుల మాటేమో కానీ.. మిగతా ఆడియన్స్ మాత్రం ఈ టైమ్ లో ఆ టైప్ సినిమా అవసరమా అంటారు. బట్ కంటెంట్ బావుంటే కామెడీ అయినా ట్రాజెడీ అయినా ఆడియన్స్ పట్టించుకోరు అనేది సినిమా సూత్రం. ఆ సూత్రం వల్లే ప్రభాస్ కూడా ఈ కామెడీ చిత్రానికి ఓకే చెప్పాడు. పైగా ఇదో హారర్ కామెడీ. ఆ తరహా చిత్రాలకు ఆద్యుడు అయిన మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రమే ఇది.

చాలామంది ఈ మూవీకి సంబంధించిన పెద్దగా అప్డేట్స్ లేవు కాబట్టి షూటింగ్ ఆగిపోయింది అనుకుంటున్నారు కానీ.. ఇది వేగంగానే చిత్రీకరణ జరుపుకుంటోంది. కాకపోతే ఆ అప్డేట్స్ ఏం బయటకు రాకుండా చూసుకుంటోంది మూవీ టీమ్. అలాగని ఏదో సీక్రెట్ మెయిన్టేన్ చేస్తున్నారు అని కాదు. ఈ మూవీ గురించిన వార్తలు పెరిగితే ఆదిపురుష్‌ మేటర్ పలచన అవుతుంది. అందుకే మారుతి చిత్రం గురించి సాధ్యమైనంతగా లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి వినిపిస్తోన్న వార్తలు వింటే ప్రభాస్ ను మరోసారి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి టైప్ లో సూపర్ స్టైలిష్‌ గా చూడబోతున్నాం అని అర్థం అవుతోంది. మారుతిగత రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా అతనికి ఛాన్స్ ఇచ్చాడంటే ఇలాంటి స్పెషల్ ఎలిమెంట్ లేదా.. తనకు బాగా ఇష్టమైన కంటెంట్ ఏదో తెచ్చి ఉంటేనే కదా ప్రభాస్ ఓకే చెప్పి ఉంటాడు. అలా చూస్తే మారుతి.. ప్రభాస్ ను ఎంత స్టైలిష్‌ గా చూపించబోతున్నాడు.. ఏ తరహా పాత్రలో చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. పైగా ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లున్నారు. మాళవిక మోననన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ప్రభాస్ సరసన రొమాన్స్ చేయబోతున్నారు.

అయితే వీరిలో ఒక పాత్ర దెయ్యంగా కనిపిస్తుంది. ఆ దెయ్యం ఎవరు అనేది కనిపెట్టే పాత్రలోనే ప్రభాస్ రాజా డీలక్స్ గా చెప్పుకునే ఆ ఇంట్లోకి/థియేటర్ లోకి అడుగుపెడతాడనీ.. అక్కడి నుంచీ అన్నీ హిలేరియస్ గా కనిపిస్తాయని అంటున్నారు. అంటే ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న బాహుబలి ఇమేజ్ ను దాటి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాగానే ఉంటుందట. ఓ రకంగా ఇది ప్రభాస్ చేస్తోన్న సాహసం అనే చెప్పాలి. మరి ఈ సాహసానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts