సెంటిమెంట్ కి నో చెప్పి ప్లాప్ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ బాలీవుడ్ బ్యూటీ ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించిన ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఎవ‌రైనా అయితే.. ఆ హీరోయిన్ ని ప‌క్క‌న‌పెట్టేస్తారు. అయితే.. ప్ర‌భాస్ సెంటిమెంట్ గురించి ప‌ట్టించుకోకుండా ఈ అమ్మ‌డుకు ఐటం సాంగ్ ఇచ్చాడు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ స‌లార్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్. ఆల్రెడీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ పూర్త‌య్యింది.

అయితే.. ఈ ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ మ‌రింత ఎఫెక్ట్ గా వ‌చ్చేలా రీషూట్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇందులో ఐటం సాంగ్ కోసం ప్ర‌శాంత్ నీల్ శ్రీనిధి శెట్టిని అనుకుంటే.. ప్ర‌భాస్ సాహో హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ ని రిక‌మండ్ చేశాడట‌. శ్ర‌ద్ధాక‌పూర్ కి ఐటంసాంగ్ కొత్తేమీ కాదు. ఏడేళ్ల క్రిత‌మే ఉంగ్లీ మూవీలో డ్యాన్స్ బ‌సంతి అంటూ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. ఆత‌ర్వాత న‌వాబ్ జాడే మూవీలో మ‌రోసారి త‌ళుక్కుమంది. సాహోలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించింది. సాహో తెలుగులో ప్లాప్ అయినా హిందీలో హిట్ అయ్యింది.

దీంతో బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న శ్ర‌ద్ధాక‌పూర్ అయితే బాగుంటుంద‌ని.. డార్లింగ్ ప్ర‌భాస్ శ్ర‌ద్ధాక‌పూర్ ని సిఫార్స్ చేశాడ‌ట‌. సాహోలో డ్యూయోట్స్ పాడిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ప్ర‌భాస్ తో ఐటం సాంగ్ లో ర‌చ్చ చేయ‌నుంది. బాలీవుడ్ లో ఆఫ‌ర్స్ లేక స‌త‌మ‌త‌మౌతున్న శ్ర‌ద్ధాకూ ఐటం సాంగ్ అయినా పాన్ ఇండియా మూవీ కావ‌డంతో బంప‌ర్ ఆఫ‌ర్ కిందే లెక్క‌. మ‌రి.. ఈ సినిమా త‌ర్వాత నుంచైనా శ్ర‌ద్ధాక‌పూర్ బిజీ అవుతుందేమో చూడాలి.

Related Posts