“ఆదిపురుష్” పూర్తి చేసిన ప్రభాస్, కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్
Bollywood Latest Movies Regional Tollywood Trending News

“ఆదిపురుష్” పూర్తి చేసిన ప్రభాస్, కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్

ఓ పెద్ద ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రావత్ ఇతర టీమ్ మెంబర్స్ ప్రభాస్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి తినిపించుకున్నారు.

ఓమ్ రావత్ ఈ ఫొటోస్ ను ట్వీట్ చేశారు. చివరి రోజు చివరి షాట్ బోలెడన్ని జ్ఞాపకాలు, కానీ ఈ జర్నీ ఇంకా పూర్తి కాలేదు. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

రామాయణం ఇతిహాస కథతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రధారి కాగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి క్యారెక్టర్ పోషిస్తున్నారు. సీతగా కృతి సనన్ నటిస్తోంది. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఆదిపురుష్ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఆదిపురుష్ థియేటర్ లలో కనువిందు చేయనుంది.

Post Comment