మళ్లీ కోవిడ్ బారిన పడ్డ పోసాని కృష్ణమురళి

రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి మళ్లీ కోవిడ్ బారిన పడ్డాడు. ఆయన కరోనా సోకడం ఇది మూడో సారి కావడం గమనార్హం. గతంలో రెండు సార్లు గట్టిగానే ట్రీట్మెంట్ చేసుకున్నాడు. డాక్టర్లు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా కరోనా పోయిందని దేశవ్యాప్తంగా ప్రజలంతా పూర్తిగా రిలాక్స్ అయ్యారు. కానీ ఈ యేడాది మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికీ రోజూ వేలాది కేస్ లు నమోదవుతున్నాయి. రీసెంట్ గా ఢిల్లీలో ఒకే రోజు పదివేలకు పైగా కేస్ లు నమోదయ్యాయి. అయినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు ఎవరు..


ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కోసం పూణె వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తనలో కరోనా లక్షణాలున్నట్టు అర్థమైందిట. టెస్ట్ చేయించుకున్నాడు. పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయిపోయి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇది మరీ అంత ప్రమాదం ఏం కాదని సమాచారం.
ఏదేమైనా కరోనా మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మంచిది. లేదంటే మళ్లీ లాక్ డౌన్ లాంటి దరిద్రాలు పట్టుకున్నా పట్టుకుంటాయి.

Related Posts